కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ – టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీని ఇటీవల అఫిషియల్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని ఈ కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ చేయగానే.. వాటే కాంబినేషన్ అంటూ సర్ ఫ్రైజ్ ఫీలయ్యారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని సినీ అభిమానులు ఆరా తీస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుది. ఈ పాన్ ఇండియా మూవీని జనవరిలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
కథానాయికగా సాయిపల్లవి పేరు వినిపిస్తోంది. అలాగే సమంత పేరు కూడా వినిపిస్తోంది కానీ ఇప్పటివరకు కథానాయిక ఎవరు అనేది ఫైనల్ కాలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల తెలుగులోనే సినిమాలు తీశారు. అది కాకుండా మిడియం బడ్జెట్ లో సినిమాలు తీశారు. అలాంటిది ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు కదా. అసలు బడ్జెట్ ఎంత.? ధనుష్ రెమ్యూనరేషన్ ఎంత..? అనేది ఆసక్తిగా మారింది. విషయం ఏంటంటే.. ధనుష్ తమిళ సినిమాలతో పాటు హిందీ సినిమాల్లో కూడా నటించాడు. అలాగే హాలీవుడ్ మూవీస్ లో కూడా నటిస్తున్నాడు.
అందుచేత కోలీవుడ్ లో తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కి డబుల్ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఓకే చెప్పారట ఈ చిత్ర నిర్మాతలు. ఇంతకీ ఎంత రెమ్యూనరేషన్ అంటే.. ధనుష్ కి 50 కోట్లు. ఇక సినిమాకి బడ్జెట్ ఎంతంటే.. 120 కోట్లు అని తెలిసింది. ఇంత భారీ బడ్జెట్ తో సినిమా తీయడం అనేది శేఖర్ కమ్ములకు ఇదే ఫస్ట్ టైమ్. మరి.. ఇంత భారీ చిత్రాన్ని శేఖర్ కమ్ముల ఎలా డీల్ చేస్తారో..? ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందో..? చూడాలి.
Must Read ;- నేనిష్టపడే దర్శకుడు శేఖర్ కమ్ముల: హీరో ధనుష్