కరోనా కారణంగా ధియేటర్లు మూతపడడం తెలిసిందే. లాక్ డౌన్ ఎత్తేసిన.. థియేటర్లు ఇంకా ఓపెన్ కాలేదు. ఇప్పుడు థియేటర్లు ఓపెన్ చేసినా జనం సినిమా చూసే మూడ్ లో లేరని థియేటర్ల ఓనర్స్ ముందుకు రావడం లేదు. అయితే.. ఎప్పుడైతే కరోనా వచ్చి థియేటర్లు మూతపడ్డాయో.. అప్పటి నుంచి ఓటీటీలకు మంచి భూమ్ వచ్చింది. కొన్ని ప్రముఖ ఓటీటీ సంస్థలు రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు భారీ ఆఫర్స్ ఇవ్వడంతో ఆ వైపుగా ఆలోచన చేస్తున్నారు. భారీ చిత్రాలు సైతం ఓటీటీ బాట పడుతున్నాయి.
ఇక అసలు విషయానికి వస్తే.. విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రాలు నారప్ప, దృశ్యం 2 ఈ రెండు చిత్రాలకు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఈ రెండు చిత్రాలను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సురేష్ బాబు నిర్ణయం తీసుకున్నారని.. ప్రముఖ ఓటీటీ సంస్థలతో అగ్రిమెంట్స్ కూడా పూర్తయ్యాయని తెలిసింది. నారప్ప సినిమాకి సెన్సార్ కూడా కంప్లీట్ చేశారు. అయితే.. నారప్ప సినిమాను ధియేటర్ లో రిలీజ్ చేద్దామనే తీశారు. పైగా ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీని థియేటర్లో చూస్తేనే బాగుంటుది.
అలాంటిది ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని తెలిసి ఓ అభిమాని నారప్ప సినిమాను థియేటర్లోనే రిలీజ్ చేయాలని కోరుతూ ఏకంగా నిరాహార దీక్ష చేస్తుండడం విశేషం. వరంగల్ కు చెందిన అల్లుడు కిరణ్ నారప్ప సినిమా ఓటీటీ రిలీజ్ కు వ్యతిరేకంగా ఒక్క రోజు నిరాహార దీక్ష ను చేపట్టాడు. నారప్ప సినిమాను ఖచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాడు.
నా వంతుగా నేను ఒక్క రోజు నిరాహార దీక్ష చేస్తున్నాను అంటూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఫోటోతో వార్తల్లో నిలిచాడు. కిరణ్. వెంటనే నారప్ప సినిమా ఓటీటీ విడుదలకు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలంటూ పిలుపునిచ్చాడు. కిరణ్ షేర్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. సురేష్ బాబు, వెంకటేష్ నారప్ప విడుదల పై నిర్ణయం మార్చుకుంటారో..? లేదో..? చూడాలి.
Must Read ;- దసరా పోటీ నుంచి తప్పుకున్న ఎఫ్ 3