వైఎస్ సతీమణి విజయమ్మ సపోర్టు కూతురు షర్మిలకేనని ఈ రోజు జరిగిన సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. కుమారుడు,ఏపీ సీఎం జగన్‌కు కాకుండా కూతురు షర్మిల వెంటేనన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ రోజు ఉదయం ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద జరిగిన ప్రార్థన్లోనూ షర్మిలతో పాటు పాల్లొని సాయంత్రం జగన్ వచ్చే వరకు ఉండకుండా హైదరాబాద్ వచ్చేసి షర్మిల ప్రారంభించిన వైఎస్పార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొన్నారు. ఉదయం ఇడుపులపాయలో నిర్వహించిన ప్రార్థనల్లో షర్మిలతో పాటు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కూడ పాల్గొన్నారు.
తొలి నుంచి షర్మిల పక్కనే..
మూడు నెలల క్రితం షర్మిల పార్టీ పెడుతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి విజయమ్మ సపోర్టుగానే ఉంటున్నారు. షర్మిలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఖమ్మంలో షర్మిల నిర్వహించిన తొలి బహిరంగ సభలోను విజయమ్మ పాల్గొన్నారు. ఆమెతో పాటు వారి బంధువర్గం సపోర్టు కూడ జగన్ కంటే ఎక్కువగా షర్మిలకే ఉన్నట్లు స్పష్టమౌతోంది. జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ షర్మిలకు సపోర్టుగా నిలవడంపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- ‘ఆల్ ది బెస్ట్’ మర్మమేమిటో..!










