డల్లాస్, చికాగో, న్యూయార్క్, ఇస్తాంబుల్ వాగ్దానాల యాది మరిచి, ఇప్పుడు కొత్తగా కెనడా హాస్పిటల్ అంటున్రు అని సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి సినీ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు చేశారు. ఎన్నో వాగ్దానాలు చేసి.. వాటి ఊసెత్తకుండా, మళ్లీ అబద్ధాలు చెబుతున్నారని, తుగ్లక్ తీరున వాగ్దానాలు చేస్తున్నారని మండిపడ్దారు. అమలు కాని అనాలోచిత హామీలు ఇచ్చుకుంటూ కేసీఆర్ గారు జిల్లాలు పర్యటిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులనా.. లేదంటే సీఎం గారి మానసిక స్థితి సరిగా లేక ఇదంతా జరుగుతున్నదా? అని ప్రశ్నించారు.
ఇప్పుడు కొత్తగా కెనడా హాస్పిటల్ అంటున్రు అని, వీటిలో ఏ ఒక్కటీ ఇంతకుముందు జరగలేదని విజయశాంతి గుర్తుకుతెచ్చారు. ధనిక రాష్ట్రం అని చెప్తున్న సీఎం గారు.. మరి పైసలున్నప్పుడు గవన్నీ ఎందుకు చెయ్యలేదు? కేవలం చేసేది ఇష్టం లేకనా.. కాదంటే నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నట్లా? మండిపడ్డారు. దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాల భూమి ఊసెత్తకుండా… ఇప్పుడు దళిత సాధికారత అని కొత్త అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ సమతుల్యతను సందేహించాల్సినట్లుందనే అభిప్రాయాలు తెలంగాణ సమాజంలో బలపడుతున్నాయి అని విజయశాంతి ట్విట్టర్ వేదికగా కేసీఆర్ ను విమర్శించారు.
Must Read ;- కేటీఆర్.. మీకు వ్యాక్సిన్ అంటే ఎంటో తెలుసా.. ? విజయశాంతి
ఇప్పుడు కొత్తగా కెనడా హాస్పిటల్ అంటున్రు. వీటిలో ఏ ఒక్కటీ ఇంతకుముందు జరగలేదు. ధనిక రాష్ట్రం అని చెప్తున్న ఈ సీఎం గారు, మరి పైసలున్నప్పుడు గవన్నీ ఎందుకు చెయ్యలేదు? కేవలం చేసేది ఇష్టం లేకనా… కాదంటే నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నట్లా? వరంగల్ ఐటీ హబ్ అన్నరు…
— VIJAYASHANTHI (@vijayashanthi_m) June 21, 2021











