తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. 22న సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించారు. గ్రామస్థులతో కలిసి సహస పంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో 3 వేల మంది గ్రామస్థులతో పాటు ఆగవ్వ కూడా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పక్కనే కూర్చుని ఆగవ్వ భోజనం చేశారు. వాసాలమర్రి గ్రామంలో ఆగవ్వ తన దోస్త్ అని సీఎం కేసీఆర్ అన్నారు. అయితే సామూహిక భోజనలు చేయడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. సీఎం పక్కన కూర్చొని భోజనం చేసిన ఆకుల ఆగవ్వ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించి గురువారం ఆమెను వైద్యులు వాసాలమర్రికి తరలించారు.
తాజాగా ఆగవ్వతో పాటు మరొకొంతమంది వాంతులు, విరేచనాలతో బాధపడినట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన వైద్య అధికారులు గ్రామానికి వెళ్లి ఇంటింటికి తిరిగారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడుతున్న కొంతమంది గ్రామస్తులకు వైద్యం అందించారు. 18 మంది మాత్రమే అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. గ్రామస్థుల అనారోగ్యానికి కలుషితం ఆహారం కారణం కాదని డాక్టర్లు తెలిపారు.
Must Read ;- కేసీఆర్ టూర్ లో కరపత్రాల కలకలం.. పార్టీ నేతల్లో గుబులు











