మీ మనసు బీజేపీతో, తనువు టీడీపీతో ఉందని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వెంటనే వెంకయ్య స్పందించారు. నా హృదయం దేశ ప్రజలతో, రాజ్యాంగంతో మమేకమై ఉందని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి పదవి చేపట్టే ముందే పార్టీకి రాజీనామా చేసినట్టు ఆయన గుర్తు చేశారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు తనను వ్యక్తిగతంగా బాధించాయన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను తాను పట్టించుకోనన్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంధ్రబాబు చేసిన ఆరోపణలను రికార్డుల నుంచి తొలగించాలని విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. నిరసనగా వైసీపీ ఎంపీలంతా వెల్ లోకి వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంలో విజయసాయిరెడ్డి వెంకయ్యనాయడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
Also Read: వెలగపూడి సవాల్‌ను విజయసాయిరెడ్డి స్వీకరిస్తారా..?











