చియాన్ విక్రమ్ కెరీర్ బెస్ట్ మూవీస్ లో ముందు వరుసలో ఉండే సినిమా ‘అపరిచితుడు’. ‘అన్యన్’ పేరుతో తమిళంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో సైతం అద్భుతమైన సక్సెస్ సొంతం చేసుకుంది. పెర్సనాలిటీ డిజార్డ్ తో బాధపడే పాత్రను విక్రమ్ అనితర సాధ్యమైన రీతిలో పోషించి మెప్పించాడు. రాము, రెమో, అపరిచితుడుగా మూడు వేరు వేరు పాత్రల్లో విక్రమ్ నట విశ్వరూపం చూపించిన ‘అపరిచితుడు’.. దర్శకుడిగా శంకర్ కూ మంచి పేరు తెచ్చిపెట్టింది.
అయితే ఇన్నాళ్ళకు ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కానుండడం విశేషం. ఒక ప్రముఖ సంస్థ అపరిచితుడు సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయమని మంచి ఆఫర్ ఇచ్చిందట. దానికి శంకర్ అంగీకారం తెలిపాడని తెలుస్తోంది. రణవీర్ సింగ్ అపరిచితుడు గా నటిస్తాడని టాక్. ప్రస్తుతం శంకర్ ‘భారతీయుడు 2’, రామ్ చరణ్ సినిమా పనులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలూ పూర్తయిన తర్వాత అపరిచితుడు హిందీ వెర్షన్ పై శంకర్ దృష్టి సారిస్తాడట.
Also Read: ‘కార్తికేయ 2’ లో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్











