తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం జగిత్యాలలోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థినులు కరోనా బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యశాఖ పరీక్షలు నిర్వహించగా, 18 మంది బాలికలకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. జిల్లా వైద్యాధికారి అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాలికలతో పాటు హాస్టల్ సిబ్బందికి పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు.
సిరిసిల్లలో
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 15 మంది బాలికలకు కరోనా సోకింది. పాఠశాలలో 62 మంది విద్యార్థినులకు కొవిడ్ టెస్టులు చేయగా, 15 మందికి వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమై కొవిడ్ బారిన పడ్డ విద్యార్థినిలకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు.
Also Read :తెలంగాణలో మళ్లీ కరోనా పంజా..