కెమెరా ముందు మామూలుగా రెచ్చిపోయేవాడు కాదు. కెమెరా వెనక అయితే ఇక సరేసరి. అలాంటి నాయకుడికి ఒక చెప్పుదెబ్బ తగిలితే.. సరి చేసుకుని సెటిల్ చేసుకోవాల్సింది పోయి.. మరింత రెచ్చిపోవడంతో అసలుకే ఎసరొచ్చి పడింది. ఇప్పుడు ఏకంగా పార్టీ పదవిని పోగొట్టుకోవాల్సి వస్తోంది. అది కూడా పార్టీ అగ్రనాయకత్వం చాలా తెలివిగా నిబంధనల పేరుతో వేటు వేస్తోంది. ఆయనే విష్ణువర్ధన్ రెడ్డి.
అడ్డగోలుగా వాదించడంలో..
విష్ణువర్ధన్‌రెడ్డి సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యేక హోదా వ్యవహారంలో గాని.. విభజన బిల్లు అమలుపై గాని.. లేటెస్టుగా స్టీల్ ప్లాంట్ గాని.. మూడు రాజధానులు గాని.. సబ్జెక్ట్ ఏదైనా సరే అడ్డగోలుగా వాదించడంలో టాపర్. అసలు రాష్ట్రాన్ని అవమానపరుస్తున్నామా… లేక రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తున్నామా అనే సెన్స్ కూడా లేకుండా ఇష్టమొచ్చినట్లు వాదించడంలో ఎక్స్‌పెర్ట్. ఆ టైమ్‌లో చంద్రబాబును గట్టిగా తిట్టినోడల్లా మంచి లీడరే మరి బీజేపీలో. అందుకే విష్ణువర్ధన్ రెడ్డికి బాగానే ప్రిఫరెన్స్ దక్కింది.
బీజేపీ రాష్ట్ర నేతల్లో ఒకరిగా..
అందుకే నెహ్రూ యువ కేంద్రం పోస్టుతో పాటు.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి కూడా దక్కింది. అంతకు ముందు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. మీడియాలో ప్రముఖంగా రావడంతో.. బీజేపీ రాష్ట్ర నేతల్లో ఒకరిగా వెలిగిపోయాడు. అయితే ఈ మధ్యే ఓ టీవీ చానెల్‌లో డిబేట్ సందర్భంగా అమరావతి జేఏసీ నేత ప్రొఫెసర్ శ్రీనివాసరావుని పెయిడ్ ఆర్టిస్ట్ అనడంతో.. ఆయన ఆవేశంగా చెప్పు పెట్టి చెంప చెళ్లుమనిపించాడు. ఇదంతా లైవ్‌లోనే జరగడంతో సెన్సేషన్ అయింది. ఈ విషయంలో ఏ మాత్రం రియలైజ్ అవకుండా ఆ మీడియా సంస్థపై కూడా యుధ్ధం ప్రకటించాడు.. పార్టీని కూడా అందుకు ఒప్పించాడు.

పార్టీ పదవి తీసేయాలని..?
కట్ చేస్తే.. కొన్ని రోజులకే ఒక ఆశ్రమాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల బారి నుంచి తప్పించడానికి రూ.30 కోట్ల డీల్ మాట్లాడుకున్నట్లు వార్తలొచ్చేశాయి. దీనిపై సమాచారం బీజేపీ అగ్రనాయకత్వానికి కూడా అందింది. అప్పటి నుంచి బాస్ పాపం మీడియా ముందుకొచ్చింది కూడా లేదు. ఇప్పుడు తాజాగా తెలుస్తున్నదేంటంటే.. ఈ వ్యవహారంపై సమావేశమైన కోర్ కమిటీ.. జోడు పదవులు ఉండకూడదనే నిబంధన అమలు చేయాలని.. విష్ణువర్ధన్ రెడ్డికి ఉన్న పార్టీ పదవి తీసేయాలని డిసైడ్ చేశారు.
ఎమ్మెల్సీ మాధవ్‌కి కూడా..
ఇప్పటికే జీవీఎల్ నరసింహారావుకి రాజ్యసభ సభ్యత్వం ఉన్నందున.. పార్టీ పదవి ఇవ్వలేదు. అలాగే సోము వీర్రాజుకు సైతం మే నెలతో ఎమ్మెల్సీ పదవీకాలం ముగుస్తోంది. ముందే అమలు చేయాలన్నా సోమువీర్రాజుకు సమస్య వస్తుందని ఆగి.. ఇప్పుడు అమలు చేయబోతున్నారు. దీని వలన విష్ణువర్ధన్ రెడ్డితో పాటు.. ఎమ్మెల్సీ మాధవ్‌కి కూడా పార్టీ పదవి లేకుండా పోతుంది.
మొత్తం మీద విష్ణువర్ధన్ రెడ్డి ఎంత వేగంగా ఎగసిపడ్డాడో.. ఎంత మిడిసిపడ్డాడో.. అంతే స్పీడుగా కిందకు పడిపోతున్నాడు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని.. రియలైజ్ అయి నోరు పారేసుకోకుండా అసలైన పాలిటిక్స్ చేస్తే.. భవిష్యత్ ఉంటుందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Must Read : విష్ణువర్ధన్ రెడ్డి అండర్ ట్రబుల్.. ఆ స్వామీజీ వ్యవహారమే కారణమా?











