పవర్ స్టార్ కుమార్తె పోలేనా అంజనా అచ్చుగుద్దినట్టు పవన్ కళ్యాణ్ మాదిరిగానే ఉండటంతో ఆ ఫొటో పెద్ద వైరల్ అవుతోంది. ఆమె చూపు, నడక డిటో పవన్ ను పోలి ఉంది. నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి అయినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పిల్లలే వార్తల్లో కనిపిస్తున్నారు. ఆ పెళ్లిలో పవన్, రేణు దేశాయ్ కి పుట్టిన పిల్లలు కనిపించడం, ప్రస్తుత భార్య అన్నా లెజినోవా పెళ్లిలో కనిపించకపోవడంతో రకరకాల వార్తలు గుప్పుమన్నాయి. ఈ మూడో భార్యకు కూడా పవన్ విడాకులు ఇచ్చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అవ్వడం జనసేన వర్గాల ఆగ్రహానికి కూడా కారణమైంది.
ఏటా క్రిస్మస్ సమయంలో రష్యాలో ఉండటం అన్నాలెజినోవాకు అలవాటు. ఆ కారణంగానే ఆమె రష్యా వెళ్లినట్టు సమాచారం. ఈ వార్తల నేపథ్యమో ఏమోగాని ఆమె సడన్ గా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పిల్లలతో కనిపించడంతో ఆ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. తన పిల్లలిద్దరితోనూ ఆమె తిరిగి హైదరాబాద్ కు వచ్చేశారు. క్రిస్మస్ వరకూ ఉండాల్సిన ఆమె ఎందుకు వచ్చేశారన్నది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. బహుశా నిహారిక పుట్టిన రోజు వేడుకల్లోనైనా ఆమె పాల్గొందామని అనుకుని ఉండవచ్చు. పైగా ఆమె నిహారికకు మరచిపోలేని ఓ గిఫ్ట్ ను ఇచ్చినట్టు ప్రచారం ఉంది.
ఇక వైరల్ అవుతున్న ఫొటోల్లో అచ్చు పవన్ కళ్యాణ్ మాదిరిగా ఉన్న పోలెనా పవన్, అన్నాలెజినోవా దంపతులకు 2013లో జన్మించింది. ఇక పోలెనా తమ్ముడు మార్క్ శంకర్ పవనోవిచ్ 2017లో జన్మించాడు. ఈ మూడేళ్ల బుడతడి కళ్లల్లోనూ పవన్ మాదిరి చురుకుదనం కనిపిస్తోంది. అన్నాలెజ్‌నేవా ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఫొటోలు ఒక్కసారిగా నెట్టింట వైరలయ్యాయి. జీన్స్, టీషర్టు వేసి ట్రెండీగా కనిపించినా కొద్దిగా లావు అయినట్టు ఉన్నారామె. మొత్తానికి ఇలా వచ్చేసి పుకార్లకు కొంత చెక్ పెట్టారు. నిహారిక దంపతులను కలిసిన ఫొటోలు కూడా ఈరోజో రేపో వైరల్ కావచ్చు. ఏదేమైనా పోలెనా అంజనా పవనోవా మాత్రం తన పేరును సార్థకం చేసుకుంది.
Must Read ;- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసులన్నా క్రేజే?