సినిమాల్లో అవకాశాలు ఇస్తామని, ఆఫీసులు తెరిచి ఎందరో కొత్తవారిని మోసం చేసే సంఘటనలు విన్నాం. డబ్బులు పెట్టమని అడిగే వాళ్ళు కొంతమంది, అమ్మాయిలను శారీరకంగా వాడుకునే వాళ్ళు మరి కొంతమంది.. అయితే సినిమా వాళ్లనే మోసం చేసేవాళ్ళు ఉన్నారా ?! కొంతకాలం క్రితం వెస్ట్ బెంగాల్ లోని కలకత్తాలో, బయట ప్రపంచానికి తెలియని అతి పెద్ద స్కాం జరిగింది. ” మీరు సినిమా తీయాలనుకుంటున్నారా ? మీ దగ్గర కేవలం లక్ష రూపాయిలు మాత్రమే ఉన్నాయా ?! ఫర్లేదు మీ దగ్గర లక్ష, పది లక్షలు ఉన్నా, కథ కేవలం పావు గంట ఉన్నా, అయిదు నిమిషాలు ఉన్నా .. మిగతాది మేం సర్దుతాం” అని పేపర్లలో ప్రకటనలు వచ్చేవి.
కాంటాక్ట్ మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు ఉండేవి.. మన తెలుగు నుంచి కొంతమంది డైరెక్టర్స్ వెళ్ళారు. కథ విని, వారి దగ్గర ఉన్న డబ్బులు లాక్కుని, ఒక్కోసారి వారి వంటి మీద బట్టలు కూడా ఊడదీసి, బంగ్లాదేశ్, చైనా బోర్డర్ లో వదిలేసే వారు. అదంతా ఒక పెద్ద మాఫియా. పాస్ పోర్టు లేకుండా, బట్టలు , డబ్బులు లేకుండా బోర్డర్ దాటడం చేసే వాళ్ళని ఏం చేస్తారు ? కాల్చి పడేస్తారు.. లేదంటే జైలు లో పడేస్తారు.. కాదనుకుంటే వాళ్ళని పిచ్చి వాళ్ళు అనుకుంటారు.. ఇలాంటి దారుణమైన పరిస్థితుల నుంచి తప్పించుకున్న తెలుగు దర్శకులు ఇద్దరు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు.
చాలా మంది మిస్సింగ్. అలాగే ఇతర భాషల్లో కూడా ఇలాంటి బాధితులు ఉన్నారు. అయితే ఆ దర్శకులు బయటకి చెప్పుకోలేదు. ఈ మోసం మీద సినిమా తీయలేదు. కానీ ఓ కన్నడ దర్శకుడు శశికాంత్ ఈ యధార్ధ సంఘటనలతో ‘రాంచి’ అనే సినిమా తీశారు. ప్రభు, దివ్య, తోటో రాయ్ చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు. రాంచి డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ కొత్త ఐడియా ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూద్దాం. ఇంతకీ ఆ తెలుగు దర్శకులు ఎవరంటారా.. అది మాత్రం సస్పెన్స్.
Must Read ;- టాలీవుడ్ లో ఎస్వీకృష్ణారెడ్డి.. కోలీవుడ్ లో మురుగుదాస్











