లక్ష కోట్లకు పైగా రుణం ఏపీ కోసం ఎదురుచూస్తున్నట్లు కాగ్ నివేదికను అందించింది. కాకపోతే వచ్చేది కాదండి… కట్టాల్సింది కావడం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, అప్పులు తీసుకోకుండా నడవదు. కానీ, ఏపీ ప్రభుత్వ తీరు చూస్తే కాస్త వేరుగా ఉందని తెలుస్తుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం దాటుతోంది. కానీ అప్పులు తీసుకోవడంతో పాటు, తీర్చుకుంటూ రావాలని కాగ్ నివేదిక తెలియజేస్తుంది.
6 ఏళ్లలో లక్ష కోట్లు
తాజా కాగ్ నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వం 6 ఏళ్లలో దాదాపు 1.3 లక్షల కోట్ల రుణం తీర్చాల్సిందే అంటూ ప్రభుత్వానికి నివేదికని అందించింది. కాగ్ ఈ నివేదిక ను 2019 మార్చి వరకు ఉన్న గణాంకాల ఆధారంగా తయారుచేసింది. తాజా నివేదికలో కాగ్ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. ప్రస్తుతం ఉన్న రుణాలను తీర్చడానికి ప్రణాళికబద్ధమైన రెవిన్యూ ప్రభుత్వానికి సమకూరేలా ఏర్పాటుచేసుకోవాలని లేకపోతే అభివృద్ధి పనులకు స్వస్తి చెప్పాల్సి ఉంటుందని పేర్కోంది.
నివేదిక వివరాలు
కాగ్ నివేదిక ప్రకారం 2019 మార్చి నాటికి ప్రభుత్వ రుణం 2,57,510 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. 2017-18 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 2018-19 ఆర్ధిక సంవత్సరంలో రుణం 15 శాతం మేర పెరిగినా, చెల్లింపుల విషయంలో తగ్గుదల ఉందని నివేదికలో పేర్కోంది. కాగ్ నివేదికలో ఒక విషయం స్పష్టమవుతుంది. అప్పులు లేకుండా ఏ రాష్ట్రం ప్రభుత్వ విధానాలను అమలుచేయలేదు. కానీ వాటి మధ్య వ్యత్యాసాన్ని తగ్గించుకుంటూ ప్రభుత్వ భారాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. వాటిని గత ప్రభుత్వం ప్రణాళికబద్దంగా పాటించనట్లు కాగ్ నివేదిక ద్వారా తెలుస్తుంది.
Must Read ;- జగన్ తొందరపాటు మూల్యం రూ.25వేల కోట్లు?
పరిమితులు దాటలేదు
సామాన్య ప్రజలే కాదు, ప్రభత్వాలు సైతం కొత్తగా రుణాలు తీసుకోవాలంటే గ్యారెంటీలను చూపించాల్సి ఉంటుంది. అందుకోసం గత ప్రభుత్వం పరిమితులకు లోబడి మాత్రమే గ్యారెంటీలను చూపించినట్లుగా కాగ్ నివేదిక స్పష్టం చేసింది. కాగ్ నియమాల ప్రకారం ఏ ప్రభుత్వానికైనా తమ రెవిన్యూలో 90 శాతం వరకు గ్యారెంటీ చూపించుకోవచ్చు. ఆ గ్యారెంటీలను బట్టి రుణం పొందే అవకాశం ఉంటుంది. కానీ 2017-18 ఆర్ధిక సంవత్సరం లోని ప్రభుత్వం కేవలం రెవిన్యూలోని 49 శాతం మాత్రమే గ్యారెంటీ చూపించి రుణాన్ని పొందినట్లుగా నివేదికలో పేర్కోంది. దీని ద్వారా ప్రభుత్వ భవిషత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వ్యవహరించినట్లు తెలుస్తుంది. పరిమితులను మించకుండా చూపడం రుణం తక్కువగా పొందినా, ప్రభుత్వ భారం భవిషత్తులో తగ్గుతుంది.
పంపకాల మాటేమిటి?
కాగ్ నివేదికలో ప్రభుత్వ రుణాలతోపాటు, పునర్విభజన జరిగిన తర్వాత జరగాల్సిన పంపకాల గురించి కూడా ప్రస్తావించింది కాగ్. 2019 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా అవతరించి 5 ఏళ్లు గడుస్తుంది. అయినా కూడా ఇప్పటీకీ రెండు రాష్ట్రాల మధ్య క్యాపిటల్ 1,51,349 కోట్లు పంపకాలు ఇంకా జరగలేదని తెలియజేసింది. అంతేకాదు, రుణాలకు సంబంధించిన 28,099 కోట్లు కూడా పంపకాలు జరగలేదని కాగ్ నివేదికలో స్పష్టం చేసింది.
నివేదికతో కళ్లు తెరుస్తారా?
కాగ్ నివేదిక ప్రకారం గత ప్రభుత్వ రుణం తీసుకున్న తీరు, తిరిగి కట్టిన తీరుపై స్పష్టత వచ్చింది. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది గత ప్రభుత్వమే అంటూ నిందలు వేసే ప్రభుత్వం ఇప్పుడు సమాధానం ఏం చెప్తుందో చూడాలి. అప్పుల శాతం పెరిగిన సంవత్సరం రుణం కట్టిన శాతం పెరగడం కాగ్ నివేదిక స్పష్టంగా ఉంది. అంతేకాదు, 90 శాతం వరకు చూపించి ఎక్కువ రుణం తీసుకునే అవకాశం ఉన్నా, పరిమితలు మించలేదని నివేదికలో కాగ్ స్పష్టం చేసింది. ఇప్పటికైనా గత ప్రభుత్వానికి నిందించడం మాని ప్రణాళికాబద్దంగా ప్రభుత్వం వ్యవహరిస్తే అభివృద్ధి జరుగుతుంది లేదా అప్పులు రొంపిలో రాష్ట్రం కూరుకుపోవడం ఖాయం.
Also Read ;- అప్పుల వేటలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు











