బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఎంటైర్ సౌత్ ఇండస్డ్రీలోనే క్రేజీ హీరోయిన్ అయిపోయింది కన్నడ బ్యూటీ రష్మికా మందన్న. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాల లైనప్ ఓ రేంజ్ లో ఉంది. ఈ నేపథ్యంలో రష్మికా ఇప్పుడో బంపర్ ఆఫర్ కొట్టేసింది. బాలీవుడ్ లో నటించే అరుదైన అవకాశం అందుకుంది. ఆల్రెడీ కన్నడ, తెలుగు సినిమాల్లో నటిస్తున్న రష్మికా.. కార్తి ‘సుల్తాన్’ చిత్రంతో తమిళ చిత్ర సీమలోకి కూడా ఎంటర్ అవుతోంది.
ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టనుండడం హాట్ టాపిక్ గా మారింది. రష్మీకా మందన్న నటించబోతున్న ఆ బాలీవుడ్ మూవీ పేరు ‘మిషన్ మజ్నూ’. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్ధ మల్హోత్రా ప్రధాన పాత్ర పోషిస్తోన్న ‘మిషన్ మజ్నూ’కి దర్శకుడు శాంతను బాగ్చీ. ఆర్సీవీపీ, గిల్టీ బై సంయుక్తంగా నటిస్తోన్న ఈ సినిమా పాకిస్థాన్ లో భారత్ రా ఏజెంట్స్ జరిపిన అతి పెద్ద కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కుతోంది.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ జరగబోతోంది. ఈ విషయాన్ని రష్మికా తన ట్విట్టర్ హ్మాండిల్ ద్వారా రివీల్ చేసింది. ఇక ఈ సినిమాలో రష్మికా పాత్ర , తదితర విషయాలు కొద్ది రోజుల్లో తెలుస్తాయి. మరి ఈ సినిమా రష్మికాకి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- పందిమాంసం అంటే మిక్కిలి మక్కువ అంటోన్న కన్నడ బ్యూటీ
— Rashmika Mandanna (@iamRashmika) December 23, 2020