నిర్మాతల దగ్గర డబ్బులు అయిపోయినప్పుడు హీరోలే నిర్మాతలుగా మారక తప్పదు. ఎందుకంటే సినిమాలు తీసి పైకొచ్చిన నిర్మాతలు బహుతక్కువ. వాళ్లను వేళ్ల మీద లెక్కించవచ్చు. సినిమా అంటే ప్యాషన్ కావడం వల్లలో, ఇతర కారణాల వల్లనో సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న నిర్మాతలు లెక్కకు మిక్కిలి ఉంటారు. హీరోలకు నిర్మాతలు దొరక్క వారే సొంత బ్యానర్లు పెట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. హీరోలు ఫైనాన్స్ చేయడం కూడా కొత్తకాదు. కీర్తిసురేష్ సినిమాకి ఓ స్టార్ హీరో ఫైనాన్స్ చేసిన సంఘటన తాజాగా వెలుగుచూసింది.
నిర్మాతల నుంచి డబ్బులు సరిగ్గా అందకో లేక ఇతర కారణాలు ఏమైనా కావచ్చు, స్టార్ హీరోలంతా నిర్మాతలుగా మారిపోయారు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలంతా ప్రస్తుతం అగ్ర నిర్మాతలుగా చెలామణి అవుతున్నారు. ఓన్ బ్యానర్లు పెట్టి వారి బాక్సాఫీస్ లెక్కలు వారే చూసుకుంటున్నారు. అయితే ఈ బ్యాచ్ లో కొందరు పక్క హీరోల్ని, హీరోయిల్ని పెట్టి కూడా సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే మోడ్రన్ మహానటి కీర్తి సురేశ్ లేటెస్ట్ మూవీ ‘మిస్ ఇండియా’ని ఈస్ట్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై మహేశ్ కోనేరు నిర్మించారు.
అయితే ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టింది మాత్రం జూనియర్ యన్టీఆర్ అనే టాక్ ఉంది. మహేశ్ కోనేరు వాస్తవానికి యన్టీఆర్ కి డిజిటిల్ పీఆర్ఓగా వ్యవహరిస్తారు. యన్టీఆర్ కి సంబంధించిన ప్రతి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ మహేశ్ కోనేరు నుంచే వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మహేశ్ కోనేరు ను ఫ్రంట్ ఎండ్ లో నిర్మాతగా పెట్టి బ్యాక్ ఎండ్ లో యన్టీఆర్ సపోర్ట్ చేస్తున్నాడని అంటున్నారు. ఇక మిస్ ఇండియా సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాల్సిందిగా యన్టీఆర్ నుంచి ఒత్తిడి రావడంతో నిర్మాత మహేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ కి అమ్మడానికి ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం.











