పూరి జగన్నాథ్.. హిట్లు, ప్లాప్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు.. సినిమాలు తీయడమే కాదు.. జీవితాన్ని ఎలా చూడాలి. జీవితాన్ని ఎలా గడపాలి.? జీవిత పరమార్థం ఏంటి..? ఇలా.. జీవితానికి సంబంధించి పూర్తి అవగాహన ఉన్న దర్శకుడు. తన పోడ్ కాస్ట్ ద్వారా ప్రతి రోజు ఆసక్తికర విషయాలను తెలియచేస్తున్నారు. ఇటీవల జీవితానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పారు. పూరి మ్యూజింగ్స్ ద్వారా ప్రతి రోజు రకరకాల టాపిక్స్ గురించి పూరి చెప్పే మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుండడం విశేషం.
తాజాగా లైఫ్ ఆంథెమ్ అంటూ జీవితం గురించి మాట్లాడారు. వివాహం గురించి మాట్లాడుతూ… మన జీవితం మూడు రోజుల డ్రామా. అలాంటప్పుడు వివాహం ద్వారా మీ జీవిత కాలాన్ని నరకం చేసుకోవడం ఎందుకు.? అని ప్రశ్నించారు. అరవై వచ్చాయని విరమించకూడదని.. కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. క్లైమాక్స్ బాగుంటే అది సూపర్ హిట్ అవుతుంది. మీ జీవితాన్ని బ్లాక్ బస్టర్ గా మలుచుకోండి. ఇది తత్వశాస్త్రం కాదు.. కనీస ఇంగితజ్ఞానం అని అన్నారు. కరోనా ఫస్ట్ వేవ్ అప్పుడు ఈ పోడ్ కాస్ట్ ద్వారా రకరకాల టాపిక్స్ గురించి మాట్లాడారు.
దీనికి అనూహ్యమైన స్పందన లభించింది. ట్విట్టర్ ద్వారా పలువురు సినీ ప్రముఖులు సైతం పూరిని అభినందించారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ టైమ్ లో కూడా పూరి తన పోడ్ కాస్ట్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. రీసెంట్ గా జీవితం గురించి పూరి చెప్పిన వేదాంతం హాట్ టాపిక్ అయ్యింది. పూరి.. మామూలు మనిషి కాదు.. మోడ్రన్ మహర్షి అంటూ అభినందిస్తున్నారు నెటిజన్లు. ఇక సినిమాల విషయానికి వస్తే.. పూరి విజయ్ దేవరకొండతో లైగర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
Must Read ;- విజయ్ – పూరి లైగర్ మూవీలో మైక్ టైసన్











