అందరికీ టాస్క్ ఇచ్చే బిగ్ బాస్ కు వంట లక్క టాస్క్ ఇచ్చినట్టే ఉంది. ఇదేంటబ్బా అనుకుంటున్నారా.. ఔను మరి.. కార్తీక దీపం సీరియల్, బిగ్ బాస్ 4 లను పోల్చాల్సి వస్తే మాత్రం బాస్ వెనుకబడే ఉన్నాడు.
కార్తీకదీపంలోని వంటలక్కకు ఉన్న మాస్ అప్పీలు ముందు బిగ్ బాస్ పప్పులుడికేలా లేవు. బార్క్ టీఆర్పీలో మాత్రం కార్తీక దీపానికే జనం పట్టంగడుతున్నారు. నిన్ననే ఈ సీరియల్ 900 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. బిగ్ బాస్ 4తో పోలిస్తే మాటీవీ సీరియల్సే ముందు వరసలో ఉన్నాయి. బిగ్ బాస్ 4 ప్రారంభమైన తొలివారంలో 18.5 టీఆర్పీ బిగ్ బాస్ కు వస్తే, కార్తీక దీపానికి 18.56 టీఆర్పీ ఉంది. బిగ్ బాస్ షో ముగింపు దశకు చేరుకున్నా కార్తీక దీపానికి ఉన్న ఆదరణ మాత్రం ఏమాత్రమూ తగ్గలేదు. వంటలక్క ముందు నాగార్జున ఓడిపోయాడా అనిపిస్తోంది. నిన్న జరిగిన 900 ఎపిసోడ్ నుంచి కార్తీక దీపం మరింత ఉత్కంఠ భరితంగా మారింది. దీపకు అనుకూలంగా కథ మారడమే ఈ ఉత్కంఠకు కారణం.
ఎవరు ముందు.. ఎవరు వెనక?
బుల్లితెరలో పాపులర్ షో ఏది అంటే వచ్చే సమాధానం బిగ్ బాస్ మాత్రమే. అలాంటిది ఈ షోకి ఉన్న క్రేజ్ కార్తీకదీపం ముందు మాత్రం వెలవెలబోతోంది అనాల్సిందే. ఒకటి రియాలిటీ షో అయితే, ఇంకోటి కాల్పనిక గాధ. ముఖ్యంగా మహిళలు అత్యధికంగా ఇష్టపడుతున్నది మాత్రం కార్తీక దీపం సీరియల్. ఇక బిగ్ బాస్ షో విషయానికి వస్తే.. ఇది యూత్ ని ఎక్కువగా ఆక్టుకుంటోంది. మరో రెండు వారాల్లో ఈ షో ముగిసిపోతుంది. వంటలక్క నటనకు అందరూ దాసోహమనటమే కార్తీక దీపానికి ఇంత క్రేజ్ వచ్చింది. వంటలక్క మాస్ స్టార్ గా మారితే, నాగ్ బాస్ మాత్రం ఆమె దాటి ముందుకు రాలేకపోుతున్నారు.
బిగ్ బాస్ కు ప్రతి సారీ కార్తీక దీపంతో మాత్రం ఇబ్బందులు వచ్చిపడుతూనే ఉన్నాయి. 42వ వారం రేటింగులో కార్తీకదీపం అగ్రస్థానంలో నిలిచింది. ఈ సీరియల్ తర్వాత స్థానాల్లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పాటు, వదినమ్మ, మౌనరాగం, కోయిలమ్మ సీరియల్స్ ఉన్నాయి. బిగ్ బాస్ ఎక్కడా కనిపించలేదు. మరి బిగ్ బాస్ ఎందుకు టాప్ 5లో చోటు దక్కించుకోలేకపోయాడో అర్థంకాలేదు. బిగ్ బాస్ కన్నా వంటలక్క ముందుండటం వంటలక్క అభిమానులను ఫిదా చేస్తోంది. కార్తీక దీపానికి రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ చూస్తుంటే ఇతర సీరియల్స్ లోనూ ఇది దడ రేకెత్తిస్తోంది. బిగ్ బాస్ షో ముగిసిపోతే వంటలక్క, డాక్టర్ బాబుల దూకుడు మామూలుగా ఉండదు.
టాప్ తెలుగు సీరియల్స్
తెలుగు సీరియల్స్ లో రుతురాగాలు సాధించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. సాయంత్రం 4 గంటలకు ‘వాసంత సమీరం లా.. నునువెచ్చని గ్రీష్మం లా.. సారంగ సరాగం లా’ అంటూ పాట వినగానే అందరూ టీవీలకు అతుక్కుపోయేవారు. నాడు అలా మొదలైన ఈ ట్రెండ్ ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్లింది. కస్తూరి, చక్రవాకం, మొగలిరేకులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సీరియల్స్ కు అంతే ఉండదు. ఒక విధంగా ఇప్పుడు వెబ్ సిరీస్ అనే ట్రెండ్ కు ఈ సీరియల్సే పునాది అనుకోవాలి.
అప్పట్లో వచ్చిన రుతురాగాలు, మొగలిరేకులు మాదిరిగానే ఇప్పుడు ‘కార్తీక దీపం’ దూసుకుపోతోంది. దీన్ని ముగించి వేయడానికి ఎవరికీ మనసు ఒప్పడం లేదు. ఇలాంటి కథలను ఆసక్తి కలిగించేలా ఇన్ని ఎపిసోడ్ ల వరకూ పొడిగించడం ఒకవిధంగా దర్శకులు, రచయితల గొప్పతనమే. ముఖ్యంగా వంటలక్క లాంటి పాత్ర ద్వారా ప్రేమీ విశ్వనాథ్ లాంటి మంచి నటి పరిచయమైంది. ఈ ట్రెండ్ భవిష్యత్తులో మరెన్ని అద్భుతాలను సృష్టిస్తుందో చూడాలి.
Must Read ;- బిగ్ బాస్ 4 విజేత అభిజిత్ కాకపోతే ఎవరు?