పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త అధ్యాయం. కలహాలు.. అలకలు.. అంతలోనే బుజ్జగింపులు.. ఇలాంటివి కలగలిపిన జీవితమే వివాహాం. మరి సంసారం అన్నాక.. గొడవులు రాకుండానే ఉంటాయా.. గొడవలని మాత్రమే చూసుకుని విడిపోకుండా.. సంసార జీవితాన్ని ఆనందంతో నింపుకోవడానికి పనిని పంచుకోవడం కూడా ఒక మార్గమంటున్నారు నిపుణులు. పనిని పంచుకుంటే గొడవలెలా మాయమవతాయి అనుకుంటున్నారు. అయితే నిపుణులు చెప్తున్న ఈ చిట్టి చిట్కాలను పాటిస్తే సరి..
ఇద్దరిదీ ఒకటే వృత్తా..
భార్య భర్తలిద్దరూ పనిచేస్తున్నది ఒకటే వృత్తి అయితే.. ఒకరి పని ఒకరు చేసిపెట్టడంలో సహకరించండి. మీ పార్టనర్ అటు ఇంటి పని.. ఇటు ఆఫస్ పని విషయంలో హడావుడి పడుతుంటే.. ఆఫీస్ పనిలో లేదా ఇంటి పనిలో కాస్త సహాయం చేయండి. దాని వల్ల అవతలి వారి టెన్షన్ తగ్గించిన వారవుతారు. దాని వల్ల వారు మీతో కాస్త సమయం గడిపే అవకాశం ఉంటుంది.
ఇద్దరూ ఇంటి నుండి పనిచేస్తున్నారా..
ఒకవేళ ఇద్దరూ ఇంటి నుండి పనిచేస్తున్నట్లు అయితే.. అటు ఇంటి పని.. ఇటు ఆఫీస్ పని ఆనందంగా ముగించండి. ఇంటి పని విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి.. అలాగే ఆఫీస్ విషయంలో కూడా ప్రణాళిక చేసుకునే అవకాశం ఉంటే చేసుకోండి లేదా అప్పటి కప్పుడు చేయాల్సినవి అయితే.. అవతలి వారు మీ పనికి సహకరించాలని కోరండి. ఇలా మీ ఇద్దరి మధ్య ఏ గొడవా లేకుండా సమోధ్య కుదిరేలా మాట్లాడి తేల్చుకోండి. మీ పార్టనర్ ఆఫీస్ పనిలో బిజీగా ఉంటే.. మీరు ఇంటి పని చేసే విధంగా ప్లాన్ చేసుకోండి.
కలిసి పనిచేస్తే కలదు సుఖం
ఇలా కలసి పనిచేయడం వల్ల రోజులో అవతలి వారు ఎంత పని చేస్తున్నారు.. ఎలా పనిచేస్తున్నారు అనేది మీకు అవగాహాన వస్తుంది. వారికి సలహాలు ఇవ్వడంతోపాటు.. వారి చేస్తున్న పని నుండి మీరు కూడా నేర్చుకోవచ్చు. దీని వల్ల మీరు మీ ఆఫీస్ వర్క్ విషయంలో మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు.. ప్రశంసలు కూడా అందుకోగలరు. ఇలా ఒకరితో ఒకరు కలిసి పని చేయడం వల్ల ఆఫీస్ విషయాలు మెరుగవడమే కాదు.. వ్యక్తిగత జీవితంలో కూడా ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది.
పని చేయడమేనా.. కలిసి గడపండి..
ఇంటి నుండి పనిచేస్తున్నాం కదా అన ఎంతసేపు పనిలో పడిపోకండి. దానికి కూడా సమయాన్ని నిర్ధేశించేకోండి. ఈ సమయానికి ఆఫీస్ వర్క్ ముగించి మీ భార్య/భర్తతో గడపడానికి సమయం కేటాయించుకోండి. అంతేకాదు, బయటకు వెళ్లడం, కలిసి ఇంటి పనులు చక్కబెట్టుకోవడం లాంటివి కూడా ఇద్దరూ కలిసి చేసుకోండి. దీని వల్ల మీరిద్దరూ వ్యక్తిగతంగా, వృత్తి పరంగా.. ఆనందంగా ఉండచ్చు.
లక్ష్యాలను నిర్ధేశించుకోండి..
వ్యక్తిగత జీవితం సాఫీగా సాగాలంటే వృత్తి పరంగా అభివృద్ధి ఉంటుంది. వృత్తి పరంగా దూసుకుపోవాలంటే వ్యక్తిగత ఆనందం చాలా ముఖ్యం. ఈ రెండింటినీ చక్కబెట్టుకోవడం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఇద్దరూ ఒకే దగ్గర ఉంటే అవకాశం లభించింది గనుగ లక్ష్యాలను నిర్ధేశించుకుని పనిచేయండి. దాని వల్ల జీవితంలో సాధించాలనే తపన ఉంటుంది. దానికి మీ పార్టనర్ సహాయం కోరండి. వారి సహాయంతో అనుకున్న అందలం అందుకుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది.
మరి ఈ చిన్ని చిట్కాలను ప్రయత్నించండి.. కలిసి పనిచేయండి.. కలతలకు చెక్ పెట్టి.. సరికొత్త ప్రేమ అధ్యాయానికి తెరతీయండి..