కరోనా కాలుపెట్టి సంవత్సరం దాటుతోంది.. ఇప్పటికీ ప్రపంచమంతా కరోనా పాటే పాడుతోంది. ఈ సంవత్సరం ఇలా కరోనా కాటుకి బలైనా.. కనీసం వచ్చే ఏడాదైనా బాగుంటుందా అంటే.. అలాంటి సూచనలు కనిపించడం.. వచ్చే 2021లో కరోనా మంత్రాన్ని జపించక తప్పేలా లేదు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని ముఖ్య సూచనలు చేసింది. కేవలం కరోనానే కాదు.. ప్రపంచ దేశాలు దృష్టి నిలపాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయని గుర్తుచేసింది. వచ్చే ఏడాదిలో ప్రపంచ దేశాలు ఈ దిశగా కృష్టి చేయాలని చెప్పింది. అవేంటో చూద్దాం..
కరోనా మనందరికి ఒక కొత్త పాఠం నేర్పింది. ఎవరికి వారుగా ఉన్న దేశాలను ‘గ్లోబలైజేషన్’ దిశగా అడుగులు వేయడంలో ముఖ్యపాత్ర పోషించింది. ఒకరికొకరు సహకరించుకునేలా చేసింది. దీనినే కొనసాగించాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తుంది. ప్రపంచ దేశాలు సహకరించుకుంటూ ముందుకు సాగడంపై ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పుకొచ్చింది. అన్నింటికంటే ముందు వ్యాక్సిన్ విషయంలో దేశాలన్నీ ఒక్కటిగా పనిచేస్తేనే అది సాధించగలరని తెలియజేసింది. అప్పుడే కనీసం రానున్న ఏడాదిలోనైనా కరోనా నుండి పూర్తిగా బయటపడడానికి అవకాశాలు ఉంటాయని, ఈ దిశగా ఆలోచించాలని చెప్పింది.
ప్రస్తుతం ప్రపంచమంతా ఉన్న సమస్య కరోనా.. అందుకోసం ఆరోగ్య డేటా, సమాచార వ్యవస్థలను గ్లోబలైజ్ దిశగా అడుగులు వేయాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. ప్రస్తుత కరనాను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అంటురోగాల నుంచి ప్రజలను రక్షించే దిశగా భవిషత్ ప్రణాళిక సిద్ధం చేయాలి. రోగ నిరోధక శక్తి చాలా వాటిని ఆపగలదు. వాటిని పెంపొందించే దిశగా వైద్య మండలి చర్యలు చేపట్టాల్సిన అవశ్యకత ఉంది. వీటితో ఇలాంటి వాటి వల్ల ఆర్థిక, వృత్తిపరమైన అసమానతనలను దృష్టిలో పెట్టుకుని.. భవిషత్తులో ఇటువంటి వాటిని ఎదుర్కొనడానికి కార్యాచరణ సిద్ధం చేయాలి. అలాగని పోలియో, హెచ్‌ఐవీ, టీబీ వంటి వాటిని అశ్రద్ధ చేయద్దు. టీకా పంపిణీ విషయంలో ప్రభుత్వాలు కార్యచరణ సిద్ధం చేసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఇలా పలు సూచనలు చేసింది డబ్ల్యూహెచ్ఓ.
Also Read: మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి