రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా కర్నూలు మంత్రాలయంలోని కల్లు దేవరకుంటలో వైసీపీ-బీజేపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాష్ట్రమంతా మా జాగీరే.. ఇంకెవరు నోరెత్తడానికి లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. అవతల పార్టీ ఏదైనా.. అది టీడీపీ, జనసేనా, బీజేపీ.. ఇలా ఏదైనా సరే తమ మాటే నెగ్గాలి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. వారి దాష్టికానికి తోడు స్థానిక అధికారులు సైతం కిమ్మనగా ఉండడంతో రెచ్చిపోతున్నారు.
మంత్రాలయంలో కల్లు దేవరకుంటలో వైసీపీ-బీజేపీ కార్యకర్తల మధ్య గొడవలు చెలరేగాయి. బీజేపీ వర్గీయులపై.. వైసీపీ దాడులకు దిగడంతో.. వైసీపీ మద్దతు దారుడు రవీంద్రరెడ్డిపై బీజేపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొడవ కాస్త పెద్దది కావడంతో కల్లు దేవరకుంటలో పోలీసులు భారీగా మోహరించారు. ఇరు వర్గీయుల మధ్య గొడవ ఇంకా పెద్దది కాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు చర్యలు చేపట్టారు.
Must Read ;- ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డిపై దాడి