ఏపీలో వైసీపీ నేతల అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లె గ్రామ పంచాయతీ 11వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ నుంచి రవికుమార్ తో నామినేషన్ వేయించేందుకు వెళ్లిన ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు తులసిరెడ్డిపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 11వ వార్డుకు రవికుమార్ నామినేషన్ వేయడాన్ని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. నామినేషన్ వేయడానికి వచ్చిన రవికుమార్ తోపాటు, అతని మద్దతుదారులపైనా దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసిరెడ్డిపైనా దాడికి దిగారు. తులసిరెడ్డిని తోసివేశారు. పోలీసులు భారీగా చేరుకోవడంతో తులసిరెడ్డి క్షేమంగా బయటపడ్డారు.
బెదిరింపులు, దాడులు..
ఏపీలో మూడో విడత స్థానిక ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతున్నారు. పోలీసుల అండతో చెలరేగిపోతున్నారు. తాజాగా పులివెందుల నియోజకవర్గం వేంపల్లె ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. వైసీపీ బలపరిచిన అభ్యర్థులను తప్ప చాలా గ్రామాల్లో నామినేషన్లు వేయాలంటే ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు.
Must Read ;- కోస్తా జిల్లాల్లో సత్తా చాటిన టీడీపీ.. వైసీపీ నేతల్లో కలవరం











