పంచాయతీ ఎన్నికల ప్రభావమో.. లేక అలవాటైన పనోగానీ.. అధికార పార్టీ నాయకులు బెదిరింపులే పరమావిధిగా పరిపాలన సాగిస్తున్నారు. తాజాగా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని గ్రామస్తులను వైసీపీ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్న ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుంది. ‘అందరూ భయంగా పని చేసుకోండి…ఈ సారి ఎవరు బలవుతారో ఎవరు లేదో చెప్పలేను. రచ్చకట్ట మీద కూర్చుని చెపుతున్నా పది, పదిహైదు మంది భుజాలు కింద కట్టె పెట్టుకుని నడుస్తారు.’ అంటూ పరోక్షంగా కాళ్లు విరిచేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.
నాకు ఎలాంటి దయా దక్షిణ్యాలు లేవు
మీరిలా భయం.. భక్తి లేకుండా ప్రవర్తిస్తే.. మరో 20 మంది బలవుతారు ఖాయమంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా కానీ.. నాకు అసలు పెద్ద, చిన్నా, పిల్లా, జల్లా అనే కనికరం లేదు అంటూ ప్రజలపై విరుచుకుపడ్డాడు. అందరూ గుర్తుంచుకోండి.. ఎవరి ప్రాణం తీయను… కాళ్ళు విరిచేస్తానంటూ గ్రామస్థులకు హెచ్చరిక జారీ చేశాడు. ఇలా వైసీపీ నేత వార్నింగ్ ఇవ్వడంతో.. స్థానిక టీడీపీ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత నుంచి గ్రామస్థులకు రక్షణ కల్పించాలని ఎస్పీకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Must Read ;- ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ.. అమిత్ షాకు టీడీపీ ఎంపీల ఫిర్యాదు











