అనిల్ రావిపూడి సినిమా .. సినిమాకి బడ్జెట్ ను .. సక్సెస్ రేట్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. ఇంతవరకూ ఫ్లాప్ అనేది ఎలా ఉంటుందో ఆయనకి తెలియక పోవడంతో, స్టార్ హీరోలు ఆయనతో ఒక సినిమా చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఆల్రెడీ మహేశ్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’తో భారీ విజయాన్ని నమోదు చేసిన ఆయన, గతంలో తాను చేసిన ‘ఎఫ్ 2’ సినిమాకి సీక్వెల్ చేస్తున్నాడు. ఆద్యంతం వినోదభరితంగా సాగిన ‘ఎఫ్ 2’ సినిమాను ప్రేక్షకులు ఇంతవరకూ మరిచిపోలేదు. ఆ సినిమా సీక్వెల్ పై కూడా అంతా ఆసక్తితో ఉన్నారు.
తాజాగా అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ, ‘ఎఫ్ 3‘ సినిమాను గురించి ప్రస్తావించారు. ‘ఎఫ్ 3’ సినిమా షూటింగు నడుస్తోంది. వెంకటేశ్ పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించాము. ఈ నెల 11వ తేదీ నుంచి వరుణ్ తేజ్ ఈ సినిమా షూటింగులో జాయిన్ కానున్నాడు. ‘ఎఫ్ 2’ మాదిరిగానే ఈ సినిమా నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా సాగుతుంది. అంతకు మించిన వినోదాన్ని ప్రేక్షకులకు అందించే ప్రయత్నమే జరుగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. జూలైలో గానీ .. ఆగస్టులో గాని ఈ సినిమాను విడుదల చేయనున్నాము” అని చెప్పుకొచ్చాడు.
ఇక ‘ఎఫ్ 2’ సినిమాలో ‘హనీ ఈజ్ ద బెస్ట్’ అంటూ మెహ్రీన్ చాలా సందడి చేసింది. తన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంది. ఆ తరువాత ఆమె చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. దాంతో ‘ఎఫ్ 3’ పైనే మెహ్రీన్ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ తో ఆమెకి మరిన్ని అవకాశాలు దక్కుతాయోమో చూడాలి. ఇక తమన్నా పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఆమె చేతిలో అరడజను వరకూ సినిమాలు ఉన్నాయి. అవి ఎంతవరకూ వర్కౌట్ అవుతాయో మాత్రం తెలియదు. ‘ఎఫ్ 3’ సక్సెస్ పై మాత్రం ఆమె బలమైన నమ్మకంతో ఉంది.
Must Read ;- మహేష్ వెంకీ మూవీ కన్ ఫర్మ్ అయ్యిందా.?