ఆడదంటే లెక్కేలేదన్నట్లు మృగాళ్లు పేట్రేగిపోతున్న రోజులివి. సందు దొరికితే చాలు.. మహిళలను లోబర్చుకోవడం, మానభంగానికి పాల్పడటం, ప్రతిఘటిస్తే మర్డర్లకు సైతం వెనుకాడకపోవడం ప్రతిరోజు మనం వార్తల్లో చూస్తున్నాం. మొన్నటి నిర్భయ మొదలుకొని నిన్నటి హాథ్రస్ వరకు ఎన్నో కేసులు దేశవ్యాప్తంగా ప్రచారం పొందినా.. వెలుగులోకి రాని దారుణాలు లెక్కకు మిక్కిలిగా ఉంటున్నాయి.
ఎంత కాంతలైనా..
ఆధునిక కాలంలో మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఎన్నో రంగాల్లో దీటుగా దూసుకుపోతున్నారు. అయితే కామాంధుల కబంధ హస్తాల నుంచి తప్పించుకోవడంలో విఫలమవుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రతిఘటించలేక బేలగా మారుతున్నారు. కాగా నూటికొక్కరు మాత్రం సబలగా నిరూపించుకుంటున్నారు. ఆ కోవలోకే చెందుతుంది చిత్తూరు జిల్లాకు చెందిన 16 ఏళ్ల బాలిక. తన చెల్లెలిపై పంజా విసరబోయిన ఓ కామాంధుడిని అపర కాళిలా అడ్డుకుంది.. తగిన తిక్క కుదిర్చి పంపింది.
అపర కాళిగా మారి..
చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం తిరుమలరెడ్డిపల్లెలో ఈ సాహసోపేత ఘట్టం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు మేకలు కాసేందుకు బయలు ప్రదేశానికి వెళ్లగా.. శంకరప్ప(40) అనే కామాంధుడు కన్ను వేశాడు. అదను చూసుకొని చెల్లిని పొదల్లోకి లాక్కెళ్లాడు. చెల్లి అరుపులు విన్న అక్క పరిగెత్తుకుంటూ వచ్చి.. కామాంధుడిని అడ్డుకుంది. వద్దని వేడుకున్నా కనికరించకపోవడంతో తన చేతిలోని కొడవలితో నిందితుడి చేతిపై నరికింది. దీంతో గురుడు కాలికి బుద్ధి చెప్పక తప్పలేదు. సాహసంతో తన చెల్లిని దక్కించుకున్న బాలిక పాటవం అనేకులకు స్ఫూర్తిగా మిగులుతుంది.
కాకినాడ పోర్టు సాక్షిగా జగన్‌కి విజయసాయి వెన్నుపోటు..??
వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి......