వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటకు ఇప్పుడు విలువే లేకుండా పోయింది. అధికారంలో ఉన్నన్ని రోజులు బెదిరిపోయిన నేతలు ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు. గత ఐదేళ్లు అధికార దర్పంతో వెలుగు వెలిగిన జగన్ రెడ్డి.. తన అహంకారంతో అధ:పాతాళానికి పడిపోయారు. దాంతో పార్టీ నేతల వద్ద కూడా ఆయన చులకన అయిపోతున్నారు. క్రమంగా వైసీపీ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పరిస్థితి ప్రస్తుతం జగన్ పార్టీలో కనిపిస్తోంది. బీఆర్ఎస్ కంటే కూడా వైసీపీ ఘోరమైన పరాభవం చవిచూడటంతో ఆ పార్టీ నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు.
ఏ పార్టీలోకి వెళ్లలేని కేశినేని లాంటి వారు, ఇంకొంతమంది నేతలు రాజకీయ సన్యాసం ప్రకటించేశారు. అటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పడిన చోటనే బలంగా నిలబడాలని తపిస్తోంది. అందులో భాగంగా కేటీఆర్.. తరచూ ప్రజల్లోనే ఉంటూ నిత్యం పార్టీ కార్యకర్తలతో మమేకం అవుతున్నారు. ఇక్కడ ఏపీలో మాత్రం జగన్ రెడ్డి అందుకు భిన్నంగా ఉన్నారు. ఓటమి నుంచి గుణపాఠాలను నేర్చుకోవాలనే ఉద్దేశం ఏమాత్రం లేకపోగా.. కార్యకర్తలను ఇంకా దూరం పెడుతూనే ఉన్నారు. దీంతో వైసీపీ క్యాడర్ మొత్తం నిరాశకు గురి అవుతూ ఉంది.
బీఆర్ఎస్ ను పటిష్ఠం చేసుకునేందుకు కేటీఆర్ ప్రయత్నాలు చేస్తూంటే.. జగన్ మాత్రం ఇంకా నిద్రావస్థలో ఉన్నట్టే కనిపిస్తోంది. వైసీపీ నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. భవిష్యత్తులో ఇది ఇంకా పెరగనుంది. క్యాడర్ కూడా ఆందోళనలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలబడాల్సిన నాయకుడు విదేశాలకు పయనం అవుతున్నారు. అందుకే ఫారిన్ వెళ్లడం కోసం కోర్టును పర్మిషన్ కూడా అడిగారు. ఓ పక్క క్యాడర్ ను, పార్టీని వదిలేసి జగన్ ఇలా తనకేమీ పట్టనట్లుగా పోతుండడం చూస్తే.. పార్టీ అభిమానులు సైతం క్రమంగా జగన్ ను మర్చిపోతారని అంటున్నారు. అసలు వైసీపీ ఉనికిపై జగన్ ఆశలు వదిలేసుకున్నారా? అని మాట కూడా వినిపిస్తోంది.
పార్టీ అధినేతనే అలా ఉంటే పార్టీ నేతలు అంత కన్నా అధ్వానంగా ఉన్నారు. అధికారంలో ఉండగా చక్రం తిప్పిన నేతలు కూడా ఎవరూ బయట కనిపించడం మానేశారు. దీంతో ఆయా చోట్ల బలంగా ఉన్న వైసీపీ.. అక్కడ కూడా బలహీనపడిపోతోంది. ఆఖరికి సజ్జల కూడా నాకేం పని అన్నట్లుగా వ్యవహరించడం మరీ దారుణంగా ఉంది. గత ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపై స్పందించాలని కోరగా.. ఎయిర్ పోర్టులో సజ్జల ముఖం చాటేసిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో యథా రాజా.. తథా నేత అన్నట్లుగా ప్రస్తుతం వైసీపీలో పరిస్థితి ఉందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి










