తరుణ్-ప్రియమణి మధ్య కుచ్ కుచ్ హోతా హై
INTRO తరుణ్, ప్రియమణి ప్రేమించుకున్నారా.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారా.. అసలు వీళ్లిద్దరి మధ్య ఏం జరిగింది?
MATTER ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోహీరోయిన్లు వీళ్లిద్దరూ. తరుణ్ అయితే బాలనటుడిగా ఉన్నప్పట్నుంచి తెలుగు ఆడియన్స్ కు తెలుసు. ఆ తర్వాత హీరోగా మారి బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఇచ్చాడు. ఇక ప్రియమణి తన స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. వీళ్లిద్దరూ కలిసి ఒకే ఒక్క సినిమా చేశారు. అదే నవవసంతం. ఇప్పటికీ టీవీల్లో అప్పుడప్పుడు ఈ సినిమా కనిపిస్తుంటుంది. ఈ ఒక్క సినిమాతోనే వీళ్లపై పుకార్లు చాలా వచ్చాయి. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటున్నారంటూ గాసిప్స్ వచ్చాయి.
అప్పటి ఆ పుకార్లపై తాజాగా స్పందించింది నటి ప్రియమణి. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రియమణి.. ఈ విషయంపై తనను ప్రశ్నించేందుకు, ఏకంగా తరుణ్ తల్లి రోజారమణి సినిమా సెట్స్ కు రావడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు ప్రియమణి. నవవసంతం సినిమా షూటింగ్ జరుగుతున్న టైమ్ లో రోజారమణి సెట్స్ పైకి వచ్చారు. ప్రియమణిని కలిసారు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ బయట గాసిప్స్ వినిపిస్తున్న విషయాన్ని ప్రియమణికి చెప్పారు.
రోజా రమణి అలా చెప్పడంతో ప్రియమణి షాక్ అయిందట. అప్పటివరకు అలాంటి ప్రచారం జరుగుతున్నట్టు తనకు తెలియదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే రోజారమణి మాత్రం చాలా హుందాగా వ్యవహరించారట. నిజంగా ప్రేమించుకుంటున్నట్టయితే తనకు చెప్పాలని, ఇద్దరికీ పెళ్లి చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రోజారమని చెప్పారట. తనకు తరుణ్ పై అలాంటి ఫీలింగ్ లేదని ప్రియమణి చెప్పడంతో రోజారమణి వెళ్లిపోయారట.
అప్పుడు సెట్స్ లో జరిగిన ఆ ఘటనను తలుచుకొని ఇప్పటికీ నవ్వుకుంటుంటారు ప్రియమణి. తనకు ఈ ఘటన బాగా గుర్తుండిపోయిందని చెప్పుకొచ్చింది. నిజానికి ఏ హీరోతోనైనా 2-3 సార్లు నటిస్తే ఇలాంటి పుకార్లు వస్తాయని, కానీ తరుణ్ తో చేసిన ఒకే ఒక్క సినిమాకు ఇలాంటి పుకార్లు రావడంతో తను షాక్ అయ్యానని అంటోంది ప్రియమణి.
నవవసంతం సినిమాతో ఓ మోస్తరు హిట్ కొట్టింది ఈ జంట. ప్రియమణి పెళ్లి చేసుకొని సెటిలైంది. ఓవైపు సినిమాలు, ఓటీటీలో కూడా నటిస్తోంది. తరుణ్ మాత్రం నటుడిగా క్లిక్ అవ్వలేకపోయాడు. తాజాగా నటించిన సినిమా కూడా ఫెయిలైంది. మరోవైపు పెళ్లి కూడా ఇంకా అవ్వలేదు. త్వరలోనే రోజారమణి ఫ్రెండ్ కూతుర్ని తరుణ్ పెళ్లి చేసుకుంటాడనే టాక్ నడుస్తోంది. ఆమె యూఎస్ లో చదువుకొని వచ్చిందట.
Must Read ;- అనిరుథ్ ప్రేమలో పడ్డ.. అందాల భామలు











