ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అయోధ్యలో రామ్ మందిరం నిర్మాణంపై తన భావోద్వేగాలను పంచుకున్నారు. చిత్రలేఖనంలో బ్రహ్మానందం అందవేసిన చేయి. ఆయన ఇటీవలే రాముడు హనుమంతుడి చిత్రాన్ని పెయింట్ వేశారు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భూమిపూజకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన సమయంలో బ్రహ్మానందం ఆ పెయింట్ వేశారు. తాజాగా ఆ పెయింట్ పై ఓ ప్రముఖ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. రామాయణం చదివిన వ్యక్తిగా, అయోధ్యలో రామ్ మందిరం నిర్మాణం గురించి తెలిస్తే హనుమంతుడు ఎలా స్పందిస్తాడో అనే ఆలోచనతో ఈ చిత్రాన్ని గీసినట్లు తెలిపారు. రామమందిర నిర్మాణంతో హనుమంతుడి కళ్ళలో ఆనంద బాష్పాలను చూసి రాముడిని కౌగిలించుకోవాలనుకుంటున్నానని ఆయన తెలిపాడు.
ఆ ఊహతోనే తన ఆలోచనలను ఒక కాగితంపై ఉంచి, హనుమంతుడు మరియు రాముడి చిత్రాన్ని చిత్రించానని తెలిపాడు. తన సుదీర్ఘ కెరీర్ లో తనకు పని, ఇల్లు తప్ప వేరేవి తెలియదని చెప్పుకొచ్చాడు. కరోనా ఉదృతి నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్న పేద ప్రజలపై తన ఆవేదనను ఆయన తెలియచేశారు. కొన్ని రోజుల కిందట బైపాస్ సర్జరీ చేయించుకున్న ఆయన సినిమాలలో నటించడం చాలా వరకు తగ్గించారు. ప్రస్తుతం ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగ మార్తాండ’ సినిమాలో నటిస్తున్నారు. దశబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆయన ఈ సినిమాలో ఏడిపించనున్నాడు. నాటకాలకు ఆదరణ లేక తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్న నటుడిగా ఆయన ఈ సినిమాలో నటిస్తున్నారు.











