విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తున్న నిర్ణయం వెంటనే వెనక్కుతీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకుడు పల్లా .శ్రీనివాసరావు నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. రోజు రోజుకు ఆయన దీక్షకు మద్దతు పెరుగుతుంది. పలు పార్టీ నాయకుల నుంచి.. సామాన్య ప్రజల వరకు తమ మద్దతు తెలుపుతున్నారు.
శ్రీనివాసరావుకు మద్దతు తెలపడానికి వచ్చిన 12 ఏళ్ల బాలిక.. ప్రభుత్వాన్ని నిలదీయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వేరు రాష్ట్రాలనుంచి కూడా ఉద్యోగాల కోసం ఇక్కడకు వస్తున్నారనీ.. అటువంటి స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు వారికి ఇచ్చేస్తే.. ఉద్యోగాలు ఎలా వస్తాయంటూ ప్రశ్నించింది. ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతారని నిలదీసింది. విశాఖ కోసం ఎందరో రైతుల వద్ద నుంచి పొలం తీసుకున్నారని.. వారికి ఏం సమాధానం చెప్తారంటూ ప్రశ్నించింది. వయసు చిన్నదైనా.. ఇంత పెద్ద సమస్య పట్ల తన వైఖరిని వ్యక్తం చేస్తున్న చిన్నారిని అందరూ అభినందించారు.
Must Read ;- జగన్‌కు పోస్కోకు విజయసాయిరెడ్డే మధ్యవర్తి.. ఆధారాలు ఉన్నాయన్న అయ్యన్నపాత్రుడు











