టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో నాటి ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఐటీ రంగానికి పునాదులు వేసి హైటెక్ సిటీ నిర్మించి నేటికి 23 సంవత్సరాలు. ఈ సందర్భంగా చంద్రబాబు వల్ల ఉద్యోగాలు పొందిన వాళ్ళు చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు. వాటిలో ఓ పోస్టు విపరీతంగా వైరల్ అయిపోయింది. ఆ పోస్టు యధాతథంగా పొందుపరుస్తున్నాం.
మేము ఊహించలేదు సర్… గ్రామాలలో గవర్నమెంట్ బడికి పోయే వాళ్ళం, ఇలా కార్పోరేట్ లైఫ్ లో ఉంటామని
మేము ఊహించలేదు సర్.. దిగువ మధ్య తరగతి అయిన మేము విదేశాలలో ఉద్యోగం చేస్తామని.
మేము ఊహించలేదు సర్..పాతికేళ్లకే పాతిక వేలు పైగా సంపాధిస్తాం అని.
మేము ఊహించలేదు సర్…గ్రామాలలో ఉన్న మా తల్లి తండ్రులకు అంత డబ్బు పంపిస్తామని.
మేము ఊహించలేదు సర్ సమాజంలో ఇలా తల ఎత్తుకొని తిరుగుతామని.
మేము ఊహించలేదు సర్..మా తల్లితండ్రులు గుండెల మీద చెయ్యి వేసుకొని హ్యాపీ గా ఉంటారని..
ఒక పాతికేళ్ళ క్రితం భారత్ లో సాఫ్ట్ వేర్ అంటే బెంగళూరు మాత్రమే అనుకునే రోజులు…..అప్పట్లోనే ఏడాదికి కొన్ని వేల కోట్ల సాఫ్ట్ వేర్ ఎగుమతులతో ఆ రాష్ట్రానికి బోలెడు ఆదాయం ఇస్తున్న నగరంగా దూసుపోతున్న సమయం. దేశంలోని పలు రాష్ట్రాల నుండి అక్కడికి వలస వస్తున్న ఇంజనీర్లు.
సరిగ్గా ఆ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి….. విజన్ 2020 అంటూ దూసుకుపోతున్నాడు. 20 ఏళ్ళ తర్వాత రాష్ట్రం ఎలా ఉండాలో ఇపుడు చెప్తాడంట అని హేళన చేశారు. అయితే ఆయన అవేం పట్టించుకోలేదు. హైటెక్ సిటీ కడతా అన్నాడు. దానిలోకి సాఫ్ట్ వేర్ కంపెనీలు వస్తాయన్నాడు. మళ్లీ విమర్శకులు విరుచుకుపడ్డారు. కంప్యూటర్లు కూడు పెడతాయా? అన్నారు, ఊరి చివర ఒక బిల్డింగ్ కడితే, దాన్లోకి ఏవో 4 కంపెనీలొస్తే ఏం ఒరుగుద్ది? అన్నారు. ఈ మనిషి ఎపుడూ ఇంతే గాల్లో మేడలు కడతాడు అని మరోమారు హేళన చేశారు.
మునుపటిలాగే.. ఈ సారి కూడా ఆయన ఈ విమర్శలనేమీ పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుపోయారు. ప్రధానమంత్రిని తీసుకొచ్చి ప్రారంభం చేయించేశాడాయన. వాళ్ళు అన్నట్లుగానే నాలుగైదు కంపెనీలొచ్చాయి. అంతటితోనే ఆగలేదా మనిషి. మైక్రోసాఫ్ట్ తెచ్చాడు, ఇన్ఫోసిస్ తెచ్చాడు , రకరకాల కంపెనీలు వచ్చాయి. వాటిని చూసి చిన్న చిన్న కంపెనీలు వేలల్లో వచ్చి చేరాయి.
కట్ చేస్తే ఆయన కట్టిన హైటెక్ సిటీ చిన్నబోయేంత పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యాలు వచ్చి చేరాయి. కంప్యూటర్లే కూడు పెట్టాయి , ఆయన గాలిలో కట్టిన మేడలే గాలితో పోటీ పడి నిలబడ్డాయి. చరిత్రలో ఫలానా రాజు ఫలానా నగరం కట్టాడు అని చదివాం. ఈ 21 వ శతాబ్ధంలో మెదడుతో ఆలోచించి ఒక మహా నగరాన్ని (సైబరాబాద్ ) సృష్టించిన వ్యక్తి ఆయన. ఆయనే నారా చంద్రబాబు నాయుడు. ఆయన వల్లే మా లాంటి లక్షలాది యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి.
ఆయన వలనే విదేశాలలో సాఫ్ట్ వేర్ రంగం లో పనిచేస్తున్నాము.
ఆయన వలనే మేము ఊహించని కార్పోరేట్ లైఫ్ జీవిస్తున్నాం.
ఆయన వలనే రాష్ట్రానికి అనేక కంపెనీలు వచ్చాయి. రాష్ట్రం ఆదాయం పెరిగింది.
ఆయన వలనే లక్షలాది మాలాంటి కుటుంబాలు సమాజంలో గౌరవంగా జీవిస్తున్నాయి.
మీరు ఇప్పుడు ఎన్నికల్లో ఒడిపోయిండొచ్చు.. కానీ ఎప్పుడో మా మనసులను గెలుచుకున్నారు.
మళ్ళీ ఆంద్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని కోరుకునే మాలాంటి వాళ్ళు ఎల్లప్పుడూ మీ వెంటే పయనిస్తాం.. మీ నాయకత్వాన్నే కోరుకుంటాం..
Must Read ;- నడిచే లైబ్రరి,పోరాటమే ఊపిరి.. విజన్ ఉన్న నేత చంద్రబాబు











