(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి-కోటబొమ్మాళి రోడ్డులోని పాలేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఉన్న బస్టాండ్ పక్కన వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థానిక వైకాపా నేతలు ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఆ స్థలం తనదని, అక్కడ వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయవద్దని ఓ ప్రైవేటు వ్యక్తి అభ్యంతరం తెలపడంతో శంకుస్థాపనకు వచ్చిన మంత్రి అప్పలరాజు అక్కడినుంచి అర్ధంతరంగా వెనుదిరిగారు.
అభద్రతాభావం సృష్టించేందుకే ..
రాష్ట్ర ప్రజల్లో అభద్రతాభావం సృష్టించడానికి తెదేపా ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర పాడి, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. సంతబొమ్మాళిలోని పాలేశ్వరస్వామి ఆలయంలో నంది విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెదేపా నాయకులు మతవిద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూడడం శోచనీయమన్నారు. పండుగ వాతావరణంలో దేవుడి విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాలు చేపట్టాలని మేము చూస్తే, భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా తెదేపా కార్యకర్తలు ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు మానసికస్థితి బాగోలేదని, విగ్రహాల్లో ఉన్నది రాళ్లు కావని, దేవున్ని ప్రతిరూపాలని గుర్తించుకోవాలని అన్నారు. సీసీకెమెరా దృశ్యాలతో వాస్తవం తేటతెల్లమైందన్నారు. మంత్రి వెంట టెక్కలి అసెంబ్లీ వైకాపా సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు, నాయకులు ఉన్నారు.
Must Read ;- నంది అపహరణ వెనుక నాటకీయ పరిణామాలు