తనతో ప్రేమ పాఠాలు.. మరో ఆరుగురితో వలపు పాఠాలు సాగిస్తున్న విషయాన్ని గుర్తించిన యువకుడు ప్రేయసి చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మంచి భవిష్యత్ కోసం విదేశాలకు వెళ్లిన యువకుగు అక్కడ ఓ యువతి ప్రేమలో పడి తనువు చాలించాడు.
తెలిసిన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రానికి చెందిన ప్రణయ్ అనే యువకుడు కెనడాకు ఉన్నత చదువుల కోసం వెళ్లాడు. అక్కడ ఓ యువతితో తనకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ప్రేమతీరాలకు వెళ్లిన వీరిద్దరూ కొంత కాలం సహజీవనం కూడా చేసినట్లు తెలిసింది. ఇలా సాగుతున్న క్రమంలో ఆ యువతి మరో ఆరుగురితో ప్రేమాయాణం సాగిస్తున్నట్లు ప్రణయ్ గుర్తించాడు. అంతే కాకుండా తనను వదిలేసి వేరే దేశానికి పయనమవ్వడంతో మనస్థాపం చెందిన ప్రణయ్ నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న సెల్ఫీ వీడియోను తనకు తానే తీసుకున్నాడు. పైగా తల్లిదండ్రులను బాధపడవద్దని సూచించాడు. తన అవయవాలను దానం చేయాలని తన చివరి కోరికను తెలియజేశాడు. ప్రేయసి తన ప్రేమను అంగీకరించలేదని, మోసం చేసిందని లాంట కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది.
చిరంజీవి నటించిన ఓ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది.. ప్రేమ అనేది జీవితంలో ఒక పార్ట్ మాత్రమే.. ప్రేమే జీవితం కాదు.. అని. ఇది తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి ఆత్మహత్యలు బహుశా ఆగుతాయనుకుంటా.
AlsoRead ;- మలుపులు తిరుగుతున్న శ్రావణి ఆత్మహత్య!
AlsoRead ;-ఓ ఆత్మహత్య..25 సంఘటనలు











