మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో బొంబాయి చట్నీతో ఫ్యామస్ అయిన ఆనంద్ దేవరకొండ సినిమాలో లాగానే నిజజీవితంలోనూ పయనించుకోవాలనుకుంటున్నట్టు ఉంది. సినిమాలో గుంటూరు వెళ్లి హోటల్ పెట్టినట్టుగానే ఇక్కడ ఫుడ్ బిజినెస్ లోకి దిగిపోయాడు. ఈ వీకెండ్ మీ సగం బిల్ నాది అనుకోవడమే ఇక తరువాయి. అన్న విజయ దేవరకొండ ఇటు సినిమాల్లో టాప్ స్టార్ గా ఎదిగినా వ్యాపారంలోనూ ముందుంటున్నాడు. ఆయన రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి రౌడీ వేర్ ఫ్యాషన్ బ్రాండ్లతోపాటు ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలోనూ పార్ట్ నర్ గా చేరాడు. అన్నబాటలోనే ఈ తమ్ముడు కూడా పయనిస్తున్నాడు.
తన మిత్రులతో కలిసి గుడ్ వైబ్స్ కేఫ్ లో భాగస్వామి అయిపోయాడు. హైదరాబాద్ లోని ఖాజాగూడాలో దీన్ని ఏర్పాటు చేశారు. ఫుడ్ లవర్స్ ను ఈ కేఫ్ రా రామ్మని పిలుస్తోంది. ఈ విషయాన్ని ఆనంద్ దేవరకొండ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఫొటోలను షేర్ చేశాడు. వారాంతంలో ఎవరైనా ఈ కేఫ్ కు వస్తే సగం బిల్లు తనే కడతానని కూడా ఈ యంగ్ హీరో అంటున్నాడు. ట్వీట్ లో ఆనంద్ దేవరకొండ ఏమన్నాడంటే ‘నేనూ మా అన్నయ్యా ఇద్దరం ఫుడ్ బేస్డ్ మూవీస్ తోనే మంచి విజయాలను అందుకున్నాం.
‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ద్వారా వచ్చిన నా రెమ్యునరేషన్ ను ఈ ఫుడ్ బిజినెస్ లోనే ఇన్వెస్ట్ చేస్తున్నా. మా ఫ్రెండ్స్ నిర్వహిస్తున్న ‘గుడ్ వైబ్స్ ఓన్లీ’ కేఫ్ లో పార్ట్ నర్ కావడం సంతోషంగా ఉంది. మీ ప్రేమే మా కలలను నెరవేరుస్తోంది’ అన్నారు. తమ్ముడికి తోడుగా అన్నయ్య విజయ్ కూడా స్పందించాడు ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ సినిమా హిట్ అయిన సంతోషంలో ఉన్నా. నేను కూడా నా ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. అందుకే ఈ వీకెండ్ ‘గుడ్ వైబ్స్ ఓన్లీ’ కేఫ్ కు వచ్చే మీ కోసం సగం బిల్ నేను చెల్లిస్తా. సో మీ అందరికీ వెల్ కమ్. బిల్ మాత్రం నాది’ అంటూ ట్వీట్ చేశారు. ఇద్దరూ సగం సగం చెల్లిస్తారా.. ఒక సగాన్ని ఇద్దరూ పంచుకుంటారా అన్నదాని మీద మాత్రం స్పష్టత లేదు. మొత్తానికి ఈ అన్నదమ్ములిద్దరూ బిల్లు కలెక్టర్ల పాత్ర పోషిస్తున్నట్టుంది.
Also Read: మిడిల్ క్లాస్ మెలోడీస్; ఆ బొకడా సినిమానా?
Good Vibes Only 😁 https://t.co/UAS20G4g2b pic.twitter.com/mDtbF193Hc
— Vijay Deverakonda (@TheDeverakonda) November 25, 2020











