బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, ప్రియురాలు నటాషా దలార్ పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. బాలీవుడ్ లో ఈ మ్యారేజే హాట్ టాపిక్ గా మారింది. అయితే.. పెళ్లి కొన్ని గంటల ఉందనగా.. హీరో వరుణ్ ధావన్ కి యాక్సిడెంట్ అయ్యింది. ఈ వార్త బయటకు వచ్చినప్పడు ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పెళ్లి సందర్భంగా ఫ్రెండ్స్ కి బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు.
ఈ పార్టీలో పాల్గొని వివాహ వేదిక వద్దకు వెళుతుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. అయితే.. చిన్న ప్రమాదమే కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారులో ఉన్న వారెవరకీ ఎలాంటి గాయాలు కాలేదు. వరుణ్ ధావన్, నటాషా దలార్ పెళ్లి గత సంవత్సరం సమ్మర్ లో జరగాల్సివుంది. అయితే.. కరోనా కారణంగా ఆగింది. ఆతర్వాత మరోసారి ప్లాన్ చేసినప్పటికీ.. వాయిదా పడుతూనే వచ్చింది. ఆఖరికి ఇప్పటికి పెళ్లి అంతా సిద్ధం అయ్యింది.
గ్రాండ్ గా జరుగుతున్న ఈ మ్యారేజ్ అలీభాగ్‌లోని ఫైవ్ స్టార్ హోటల్లో జరుగుతుంది. మెహందీ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, కత్రినా తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. త్వరలో రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.
Must Read ;- ధూమ్ ధామ్ గా వరుణ్ ధావన్ మూడు రోజుల పెళ్లి ముచ్చట











