కియారా అద్వానీ, వరుణ్ ధావన్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం ‘జగ్ జగ్ జీయో’. ఈ సినిమాకు రాజ్ మెహతా దర్శకత్వం అందిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. మళ్ళీ ఈమధ్యనే తిరిగి షూటింగ్ ప్రారంభం అయ్యింది. కియారా అద్వానీ, వరుణ్ ధావన్ పై కీలక సన్నివేశాలను చండీఘర్ లో తెరకెక్కించారు దర్శకుడు రాజ్ మెహతా. అక్కడ షూటింగ్ ముగించుకొని ముంబయి చేరారు కియారా అద్వానీ, వరుణ్ ధావన్. ముంబయి ఎయిర్ పోర్ట్ లో తళుక్కుమని మెరిసిన ఈ ఇద్దరినీ తమ కెమెరాలో బంధించారు ఫొటోగ్రాఫర్లు.
ఆ ఫోటోలలో వరుణ్, కియారా ఎంతో అందంగా, స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చారు. కియారా మెడ వరకు పట్టే లేత గోధుమరంగు టాప్, దానికి తగ్గా మ్యాచింగ్ ప్యాంట్, లోఫర్ బూట్లు ధరించి కనిపిస్తుంది. అలాగే ఆమె ముఖానికి తెలుపు రంగు ముసుగుతో, వెండి రంగు హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని చాలా సహజంగా, అందంగా కనపడుతోంది. ఇక వరుణ్ ధావన్ విషయానికి వస్తే ఎరుపు రంగు టీ షర్ట్ దాని లోపల తెల్లటి చొక్కా , మ్యాచింగ్ వైట్ ప్యాంటు ధరించాడు.
ఇటీవలే కోవిడ్ మహమ్మారిని ఓడించిన ఈ నటుడు, కియారాతో కలిసి సినిమా షెడ్యూల్ ను పూర్తి చేసుకొని ముంబైకి తిరిగి వచ్చినప్పుడు బ్లాక్ మాస్క్ ధరించి కనిపించాడు. ఇక సినిమా విషయానికి వస్తే ఇందులో అనిల్ కపూర్, నీతూ కపూర్ లు కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ధర్మ ప్రొడక్షన్ అండ్ టీమ్ గుడ్ న్యూస్ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 80 శాతం పూర్తి అయింది.
Must Read ;- మాల్దీవులను హీటెక్కించిన హన్సిక