బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి మూడు ఏళ్లు అవుతుంది. వరుస అపజయాలతో సతమతమవుతున్న షారుఖ్ చివరిసారిగా ‘జీరో‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీనితో ఆయన సినీ జీవితం డైలమాలో పడింది. తన వరుస సినిమాల పరాజయానికి కారణాలు వెతికే పనిలో పడ్డాడు షారుఖ్. మూడేళ్లు భారీ గ్యాప్ తర్వాత ఎట్టకేలకు యశ్ రాజ్ బ్యానర్ లో ‘పఠాన్‘ అనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు షారుఖ్. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కండల వీరుడు, బాలీవుడ్ మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటించబోతున్నాడు. త్వరలోనే ‘పఠాన్’ సినిమా పట్టాలెక్కబోతుంది.
ఈ చిత్రంపై షారుఖ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి ముఖ్య కారణం షారుఖ్ మూడేళ్ల గ్యాప్ తీసుకోని సినిమా చేయడం. అలాగే మరో కారణం ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా నటించడానికి ఒప్పుకోవడం. ‘పఠాన్’ సినిమా ఇంకా పట్టాలెక్కకుండానే షారుఖ్ మరో రెండు సినిమాలను ఓకే చేసాడని సమాచారం. ఎప్పటి నుండో సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ అట్లీతో షారుఖ్ ఒక సినిమా చేయనున్నాడని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ షారుఖ్ ‘పఠాన్’ సినిమా తర్వాత అట్లీతో ఒక సినిమా చేయనున్నారు. షారుఖ్, అట్లీ సినిమా వచ్చే ఏడాది మధ్యలో ప్రారంభం కానున్నదని సమాచారం.
అట్లీ సినిమా తర్వాత షారుఖ్ రాజ్ డీకే దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నాడని బాలీవుడ్ టాక్. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ డీకే ఒక వైవిధ్యమైన కథను షారుఖ్ కు వినిపించాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమాపై పూర్తి క్లారటీ రానున్నదని తెలుస్తోంది. ఇలా షారుఖ్ వరుస సినిమాలను ఓకే చేస్తూ తన అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. షారుఖ్ చేస్తున్న వరుస సినిమాలు భారీ విజయం సాధించి హిట్ ట్రాక్ లోకి రావాలని కోరుకుందాం.
Must Read ;- బాలీవుడ్ బాద్షాని డైరెక్ట్ చేసిన ఆమిర్ ఖాన్ ?










