బాహుబలి ‘ సక్సెస్ తరువాత … సారీ వసూళ్ళ తర్వాత భారతీయ సినిమా రంగం మొత్తం అస్తవ్యస్తమైంది. ఆ స్థాయి వైడ్ రీచ్ చేరాలని , కలెక్షన్స్ సాధించాలని ప్రయత్నాలు మొదలయ్యాయి . తమిళంలో విజయ్ ‘పులి’ అని తీస్తే డిజాస్టర్. సి. సుందర్ ఓ సినిమా అనౌన్స్ చేసి ఆపేశారు. కన్నడంలో ‘కురు క్షేత్ర’ తీశారు . వర్కవుట్ కాలేదు. మళయాళంలో మమ్ముట్టితో ‘ మామలాంగం ‘ అనే సినిమా తీశారు . మోహన్ లాల్- ప్రియ దర్శన్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తీశారు .. కానీ కరోనా కారణంగా రిలీజ్ వాయిదా వేశారు . హిందీ లో అమితాబ్ – అమీర్ ఖాన్ తో తీసిన థీఫ్ అఫ్ హిందూస్తాన్” ఫలితం అందరికీ తెలిసిందే .
ప్రస్తుత వాతావరణం భారీ సినిమాలకు అనుకూలంగా లేదని అనిపిస్తోంది. తెలుగు లో RRR విషయానికి వస్తే దర్శకుడు రాజ మౌళి ఎక్స్పెటేషన్ ట్రాప్ లో పడ్డారు. మగ ధీర ‘ తర్వాత ప్రేక్షకుల అంచనాలు అందుకోవడం కష్టమవుతుందని ‘మర్యాద రామన్న’, ‘ఈగ ’ లాంటి సినిమాలు చేశారు . ఈసారి మాత్రం ‘బాహు బలి ’ తర్వాత RRR లాంటి భారీ ప్రాజెక్ ఎత్తుకున్నారు. కరోనా కారణంగా మొత్తం షూటింగ్ అప్ సెట్ అయింది . వచ్చే ఏడాది కానీ మొదలయ్యే అవకాశాలు లేవు .
థియేటర్లు తిరిగి మొదలవ్వాలి. ఒక సూపర్ హిట్ సినిమా ఎంత కలెక్ట్ చేయగలదో తెలియాలి . సినిమా రిలీజ్ కి సరైన సీజన్ కావాలి . ఇవీ RRR సమస్యలు . ఇక అనౌన్స్ అయి సుదీర్ఘ కాలం వాయిదా పడ్డ సినిమా గుణశేఖర్ ” హిరణ్య కశ్యప “. రుద్రమ దేవి తర్వాత ఐదేళ్ళ నుంచి ఈ ప్రాజెక్ కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత పెద్ద బడ్జెట్ వర్కవుట్ కావడం కష్ట సాధ్యమని వాయిదా పడినట్లు తెలుస్తోంది. కన్నడం లో KGF2 విషయానికొస్తే సంజయ్ దత్ తీవ్ర అనారోగ్యం కారణంగా ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే. కరోనా వల్ల విదేశాలలో ఇప్పుడే షూటింగ్ చేయలేని పరిస్థితులు.
ఇవే సమస్యలు చిన్న సినిమాలకి ఉన్నప్పటికీ ఈ భారీ సినిమాల అంచనాలు ఎక్కువ కావడంతో భారతీయ సినిమా పరిశ్రమ భయపడుతోంది. కరోనా వచ్చి భారీ సినిమాలకు ఓ హెచ్చరిక చేసిందా అనిపిస్తోంది. భారీ సినిమాలు నిర్మిస్తే చేతులు కాల్చుకోవడమే అనే అభిప్రాయం నిర్మాతల్లో నెలకొంది. ఒక సినిమా హిట్ అయితే ఇక అదే బాటలో వెళితే దెబ్బతింటామనే అభిప్రాయం నిర్మాతల్లో నెలకొంది.










