అనసూయ మంచి అందగత్తె అని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు .. ఆమె భారీ అందాల భామ అని గుర్తుచేయవలసిన అవసరం లేదు. కాస్త ఒళ్లు చేసిన హంసలా ఉంటుందని చెబితే అతిశయోక్తి కాదులే అనుకుంటారు. సొగసుల పురివిప్పిన నెమలి అంటే నిజమేకదా అని ఏకీభవిస్తారు. అలాంటి అనసూయ ఇప్పుడు సినిమాల్లో బిజీ అవుతోంది. నిన్నమొన్నటి వరకూ ఆచితూచి సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె, తన దూకుడు పెంచినట్టుగానే అనిపిస్తోంది. బుల్లితెరపై తన ప్లేస్ కి ఢోకా లేకుండానే ప్లాన్ చేసుకుని మరీ స్పీడ్ పెంచడం విశేషం.
ఈ మధ్య కొత్తగా ఏ ప్రాజెక్టు మొదలైనా ఆ సినిమాకి సంబంధించి అనసూయ పేరు వినిపిస్తోంది. ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనో .. స్పెషల్ సాంగ్ కోసం ఆమెను తీసుకున్నారనో ప్రచారం జరుగుతోంది. స్పెషల్ సాంగ్ కోసం అనసూయను సంప్రదిస్తున్నారనే వార్త ప్రతి ప్రాజెక్టుకి సంబంధించి వినిపిస్తూ ఉండటంతో, అసలు ఆమె ఎందులో చేస్తోందో .. ఎందులో చేయడం లేదో అనే విషయంలో ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ‘చావుకబురు చల్లగా’ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ చేసిందనే విషయం మాత్రం ఖాయమైపోయింది.
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ‘చావుకబురు చల్లగా‘ సినిమా రూపొందింది. కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తికేయ జోడీగా లావణ్య త్రిపాఠి అలరించనుంది. మార్చి 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, హాట్ హాట్ గా ఒక స్పెషల్ సాంగ్ ఉందట. ఈ పాట అనసూయ అందాలకి అద్దం పడుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ పాటను రిలీజ్ చేయనున్నట్టు దర్శక నిర్మాతలు చెప్పారు. మరి హార్ట్ బీటు పెంచేసి ఈ నాటుసాంగు ఏ స్థాయిలో హీటు పెంచుతుందో చూడాలి.
Must Read ;- అనసూయకు అరుదైన గౌరవం నెటిజన్లకు షాక్..











