తెలుగు తెరపై పూర్తి వినోదభరితమైన చిత్రాలతో పాటు, అప్పుడప్పుడూ వినోదంతో పాటు ఆలోచింపజేసే సినిమాలు కూడా వస్తున్నాయి. సహజత్వానికి దగ్గరగా ఉండే ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నిజజీవితంలో తారసపడే పాత్రలను మలిచినట్టుగా అనిపించే ఈ తరహా కథాకథనాలకు మంచి ఆదరణ లభిస్తుండటం విశేషం. అయితే ఇలాంటి కథలను తెరకెక్కించడానికి కొంత ధైర్యం కావాలి.. మరికొంత సాహసం చేయాలి.
అలాంటి బలమైన కథాకథనాలతో ఇటీవల కాలంలో రూపొందిన చిత్రంగా ‘గమనం‘ కనిపిస్తోంది. ఈ సినిమాలో వాస్తవ పరిస్థితుల్లో నడిచే కథాకథనాలే హీరో. ఇతర పాత్రలన్నీ కూడా ఆ కథలో భాగాలై ఆసక్తికరంగా నడుస్తుంటాయి. అలాంటి ఈ సినిమాకు రమేశ్ కరుటూరి .. వెంకీ పుషాడపు .. జ్ఞానశేఖర్ నిర్మాతలుగా వ్యవహరించగా, సుజనారావు దర్శకత్వం వహించారు. శ్రియ .. శివ కందుకూరి .. ప్రియాంక జవాల్కర్ .. నిత్యామీనన్ .. సుహాస్ .. చారుహాసన్ ప్రధానమైన పాత్రలను పోషించారు.
రీసెంట్ గా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఒక్క కట్ కూడా లేకుండా క్లీన్ ‘U’ సర్టిఫికెట్ ను సంపాదించుకోవడం విశేషం. మార్చి 19వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. దాదాపు ఈ తేదీ ఖరారైపోయినట్టేనని అంటున్నారు. ఓటీటీ వైపు నుంచి మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ, థియేటర్లలోనే విడుదల చేయాలనే పట్టుదలతో నిర్మాతలు ఆ దిశగానే అడుగులు వేస్తూ వచ్చాట. ఇళయరాజా సంగీతం .. జ్ఞానశేఖర్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు.
Must Read ;- నిధి అగర్వాల్ కు గుడి.. విగ్రహానికి పాలాభిషేకం!











