తెలుగు అమ్మాయి అయినప్పటికీ.. తమిళ చిత్రాలతో మంచి పాపులారిటీ తెచ్చుకుని .. ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది అందాల అంజలి. అయితే ఇక్కడ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే రాలేదు. బాలయ్య, వెంకీ, రవితేజ లాంటి సీనియర్ హీరోల సరసన జోడీ కట్టునప్పటికీ ఆమె కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగ పడలేకపోయింది. అంజలి ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తూ .. మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది.
ఈ నేపథ్యంలో అంజలికి ‘వకీల్ సాబ్’ సినిమా మంచి కమ్ బ్యాక్ మూవీగా మారిపోయింది. ఇందులో జరీనా అనే ముస్లీమ్ యువతిగా నటించిన ఆమె పెర్ఫార్మెన్స్ కు మంచి అప్లాజ్ లభించింది. ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే ఓ సందేశాత్మక కథాంశంతో రూపొందిన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ప్రస్తుతం ఈ సినిమా కి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో.. అంజలి ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
వకీల్ సాబ్ సినిమాలో ముగ్గురు అమ్మాయిల్లో కీలకమైన పాత్ర నివేదా థామస్ దే అయినప్పటికీ.. ఇందులో అంజలికి కూడా మంచి ప్రధాన్యతనే ఇచ్చారు. ఒక దశలో వారి మీద మోపపడిన కేసు మరింత జెటిలమవడానికి ఆ పాత్రే కారణమవుతుంది. అలాగే.. .ఆ కేసు లో ఓ కీలకమైన పాయింట్ వకీల్ సాబ్ కు లభించడానికి కూడా ఆ పాత్రే సహాయం చేస్తుంది. మొత్తం మీద తాను ఏ సినిమాతో అయితే తిరిగి ఫామ్ లోకి రావాలనుకుందో .. అలానే ఇప్పుడు జరగడంతో అంజలి విజయోత్సాహంతో కనిపిస్తోంది. ఈ సినిమా తెచ్చిపెట్టిన మంచి పేరుతో .. ఫ్యూచర్ లో మరిన్ని మంచి పాత్రలు లభిస్తాయని ఆశిస్తోంది. మరి అంజలికి ఏ రేంజ్ లో ఆఫర్స్ లభిస్తాయో చూడాలి.
Must Read ;- ‘వకీల్ సాబ్’ వీక్షణకు మెగా సపరివార సమేతం











