విజయవాడలో నిబంధనలు ఉల్లంఘించిన ఏడు ప్రైవేటు ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కన్నాఅధిక ఫీజులు దండుకుంటోన్న ఏడు కరోనా ఆసుపత్రులపై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నిమ్రా ఆసుపత్రి, గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పటల్ సహా ఏడు ఆసుపత్రులపై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కలెక్టర్ ఇంతియాజ్‌కు ఫిర్యాదు చేయడంతో అధికార యంత్రాంగం ఆసుపత్రులు తనిఖీలు చేసి,క్రిమినల్ కేసులు నమోదు చేసింది.
ప్రతి చోటా ఇదే తంతు
కరోనాతో ప్రజలను భయపెట్టి ప్రవేటు ఆసుపత్రుల్లో లక్షలకు లక్షలు కాజేస్తున్నారు.అధికారులు అప్పుడప్పుడు జరిపే దాడులతో పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కరోనా వైద్యం పేరుతో విజయవాడలో ఒక్కో రోగికి రూ.5 నుంచి రూ.12 లక్షలు బిల్లు వేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.కరోనా వైద్యం పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని నిలువరించేందుకు తరచుగా తనిఖీలు నిర్వహించాలని రోగుల కుటుంబీకులు కోరుతున్నారు.ఇక కరోనా వైద్యంలో కీలకంగా వాడుతున్న రెమిడిసివర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే విజయవాడ,గుంటూరు నగరాల్లో ఒక్కో ఇంజక్షన్ రూ.24 వేలకు బ్లాకులో అమ్ముతున్నారు.ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయించిన రెమిడిసివర్ కూడా బ్లాకు మార్కెట్ కు తరలిపోతోందనే విమర్శలు వస్తున్నాయి.
Must Read ;- కరోనా కు జీవించే హక్కు ఉంది.. మాజీ సీఎం స్టేట్ మెంట్ : ట్రోల్ చేస్తున్న నెటిజన్లు










