పిడికిలి బిగించిన టీడీపీ అనుబంధ సంఘాలు!
టీడీపీ అధినాయకుడు చంద్రబాబుకు జరిగిన అవమానాలకు చలించిపోయిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈసారి ఎలాగైనా చంద్రబాబు ను తిరిగి సీఎం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అనుబంధ సంఘాలన్నీ ఒకతాటిపైకొచ్చి.. జగన్ వైఫల్యాలను ఎండకట్టేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. ప్రజలను చైతన్య పరచి, ముందుకు సాగాలని రూడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు మహిళ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించి, ప్రభుత్వ అరాచకాలపై సాగించాల్సి పోరు ఎజెండాను రూపొందించారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించుకున్నారు. జగన్ రెండునరేళ్ల పాలనలో దాదాపు 550 పైగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరగగా .. డ్రాక్వా సంఘాల డబ్బులను కూడా జగన్ ప్రభుత్వం కాజేయాలని చూస్తుందని.. ఇలా మహిళలకు జరిగే అన్యాయలపై పోరాడాలని నిర్ణయించారు. వీటినే రాష్ట్రంలోని మహిళా లోకానికి తెలిపేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. అలాగే తెలుగు విద్యార్థి, తెలుగు యువత కూడా కార్యచరణను సిద్ధం చేస్తోంది. ఎయిడెడ్ విలీనం, యువత ఉపాధి కల్పన వంటి వాటిపై నిర్విరామంగా పోరాడాలని సంకల్పించినట్లు తెలుస్తోంది.
ప్రతిజ్ఞలకు, దీక్షలకు పూనుకుంటున్న తెలుగు తముళ్లు..
చంద్రబాబు కన్నీరు చూసి చలించిపోయిన పార్టీ శ్రేణులు మళ్ళీ చంద్రబాబు ను సీఎం చేసేవరకు శ్రమిస్తామంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకట రాజు చేసిన పసుపు ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞను ఛాలెంజ్ గా స్వీకరించి పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అక్షర, దృశ్య రూపంలో వారి అభిప్రాయాలను, భావాలను పెద్ద సంఖ్యలో వ్యక్తం చేశారు. టీడీపీ ప్రొఫైషనల్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనకమేడల వీర కూడా స్పందించారు. ఇది నా సంకల్పం, నా చంద్రన్న దీక్ష, ఈరోజు నా నాయకుడు తీసుకున్న నిర్ణయం, అందులో నా బాధ్యత ప్రతిరోజు నాకు గుర్తుండేలా .. చంద్రబాబు ముఖ్యమంత్రిగా మరలా అసెంబ్లీలో అడుగు పెట్టి, నా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగే వరకు తాను నల్ల చొక్కాను మాత్రమే ధరిస్తానని భీష్మించారు. అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకుడు రాజమండ్రి ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తన ఫేస్ బుక్ లో ఎక్కడైతే మా నాయకుడు అవమానించారో .. అక్కడే మళ్ళీ తెలుగుదేశం జెండా ఎగురవేస్తాం అంటూ పోస్ట్ చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఫుల్ యాక్టీవేట్ అయ్యాయి. వైఫల్యాలను ఎజెండాగా తీసుకుని జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని పధక రచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
Must Read ;- టీడీపీ అత్యవసర సమావేశం .. రూట్ మ్యాప్ రెడీ!











