మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది చరణ్ కి 15వ చిత్రం కాగా దిల్ రాజుకు 50వ చిత్రం. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూణెలో జరిగింది. సెకండ్ షెడ్యూల్ ఇటీవల స్టార్ట్ అయ్యింది. అయితే.. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ లో ఉండగానే రికార్డ్ రేటుకి ఈ సినిమా రైట్స్ ను జీ సంస్థ సొంతం చేసుకుంది.
ఇంతకీ ఆ.. రికార్డ్ రేటు ఎంతంటే.. 350 కోట్లు. థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ కలిపి 350 కోట్లకు ఈ మూవీ రైట్స్ దక్కించుకుంది. ఈ అమౌంట్ తోనే దిల్ రాజు పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది. ఇక మ్యూజిక్ రైట్స్, ఓవర్ సీస్ రైట్స్, రీమేక్ రైట్స్ తో దిల్ రాజుకు లాభాలు రానున్నాయి. అంతే కాకుండా జీ సంస్థ థియేటర్లో రిలీజ్ చేస్తుంది కనుక నైజాం ఏరియా రైట్స్ ను ఒక డిస్ట్రిబ్యూటర్ గా కొనుక్కుని లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. ఏ రకంగా చూసుకున్న దిల్ రాజుకు ఈ సినిమాతో భారీ లాభాలు రావడం ఖాయం.
అదీ కూడా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ లో ఉన్నప్పుడే లాభాలు పొందడం విశేషం. ప్రస్తుతం జరుగుతున్న సెకండ్ షెడ్యూల్ లో చరణ్ పై కనీవినీ ఎరుగని రీతిలో ఇంకా చెప్పాలంటే.. ఆడియన్స్ షాక్ అయ్యేలా భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ సినిమాకి హైలెట్ అనేలా ఉంటుందట. 2023 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనేది ప్లాన్. మరి.. ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కాకుండా.. రికార్డ్ రేటు దక్కించుకుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
Must Read ;- రిలీజ్ లోనూ ట్రిపుల్ ఆర్ కొత్త రికార్డు











