అధికారపార్టీకి అదిరిపోయే సమాధానం!
గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో అధికారపార్టీ ఎమ్మెల్యే బొల్లా బ్రాహ్మనాయుడి ఇలాకాలో ‘తెలుగు దేశం’పార్టీ జెండాను రెపరెపలాడించారు సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ఎమ్మెల్యే బొల్లా సొంత మండలం శావల్యాపురం జడ్పీటీసీ ఎన్నికల్లో అధికారపార్టీ కంగుతిపించేలా ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది టీడీపీ. 1046 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి హైమావతి ఘనం విజయం సాధించారు. ఈ ఎన్నికలను జీవీతో పాటు టీడీపీ శ్రేణులు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఎమ్మెల్యే సొంత మండలంలో టీడీపీని గెలిపించి నిలబెట్టాలని వ్యూహాత్మకంగా అడుగులు వేసి, విజయం సాధించారు. దీంతో టీడీపీ శ్రేణులు వినుకొండ నియోజకవర్గంలో సంబరాలు చేసుకుంటున్నారు.
జోగికి దెబ్బపడిందిగా!
కృష్ణాజిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా పరిషత్ ఎన్నికల్లో తమ్ముళ్లు గట్టిదెబ్బకొట్టారు. పెడన జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి ఆర్జా నగేష్ 644 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కౌంటింగ్ సమయంలో రౌండ్ రౌండ్ కు ఉత్కఠత నెలకొంది. చివరి రెండు రౌండ్స్ లో స్పష్టమైన ఆధిక్యతను కబపర్చి సత్తా చాటింది టీడీపీ. అలానే శ్రీకాకుళం జిల్లా హిరమండలం జడ్జిటీసీ స్థానం టీడీపీ సొంతమైంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి బుచ్చిబాబు 89 ఓట్లతో గెలిచారు. తీవ్ర ఉద్రిక్తతలు, రీకౌంటింగ్ డ్రామాల నడుమ ఎన్నికల అధికారులు ఫలితాలను వెల్లడించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై లాఠీచార్జి చేశాడు. ఏదీఏమైన చివరికి హిర గడ్డపై టీడీపీ జెండాను పాతారు తమ్ముళ్లు!
Must Read ;- పరిషత్ ఎన్నికలో ‘టీడీపీ’ హవా!










