ఏపీలో కొత్త టిక్కెటింగ్ వ్యవస్థ వచ్చేస్తోంది. ఎవరైనా ఇక సినిమా చూడాలనుకుంటే ఆన్ లైన్ లోనే టిక్కెట్లు తీసుకోవాలి. సినిమా థియేటర్లలో కూడా అలాంటి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆన్ లైన్ లో టిక్కెట్లు కొనుక్కోవడానికి గ్రామీణ ప్రజలకు సాధ్య పడదు. వారికి అంత నాలెడ్జి కూడా ఉండదు. ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ ఎమెండ్మెంట్ బిల్ ను మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇక నుంచి టిక్కెట్లను ఆన్ లైన్ లోనే తీసుకోవాలనే నిబంధనపై ప్రభుత్వం చట్టం చేసింది.
ఇక నుంచి రోజుకు నాలుగు ఆటలు మాత్రమే ప్రదర్శిచే వీలవుతుంది. బెనిఫిట్ షోలను ఇకపై వేయడం కుదరదు. ఇలాంటి షోలకు రూ. 300, 500, 1000, 1500 వసూలు చేస్తున్నారు. దీనివల్ల పేద, మధ్య తరగతి ప్రజలు దోపిడీకి గురవుతున్నారనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. స్టార్ హీరో సినిమా విడుదలైతే రోజుకు ఆరు నుంచి 8 షోల వరకూ ప్రదర్శస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో చెప్పారు. సినిమా పరిశ్రమ కోరిన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు.
నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని మంత్రి అంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీద సినీ పరిశ్రమ పరంగా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమవుతాయో చూడాలి. వచ్చే నెల నుంచి పెద్ద సినిమాలు విడుదలకాబోతున్నాయి. వీటిలో పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. టిక్కెట్ల రేటు పెంచాలన్న డిమాండు ఉన్నా ఆ విషయంలో ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. సినిమా పరిశ్రమ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Must Read ;- ఓటీటీలో 10 రోజుల వ్యవధిలో 10 సినిమాలు











