TDP and CPI Are Serious About Minister Anil Kumar On Polavaram Project
డిసెంబర్ 1, 2021 పోలవరం పూర్తిచేసి తీరుతాం!
ఒట్టిమాటలే.. చేతల్లో శూన్యం అన్నట్లు మంత్రి అనిల్ అనాడు అసెంబ్లీలో పేల్చిన డైలాగ్స్ లోని ఆంతార్యం. జగన్ రెడ్డి ప్రభుత్వం హయంలో పోలవరం పూర్తి ఆంధ్రుల పాలిట కలవరంగానే మిలిపోద్దే తప్ప పూర్తి కాదు అన్నది ప్రతిపక్ష టీడీపీ విమర్శలు నేడు నిజమయ్యాయి. 2020 నవంబర్ 24 న అసెంబ్లీ సాక్షిగా వచ్చే ఏడాది 2021, డిసెంబర్ 01కి పోలవరం నిర్మించి తీరుతాం, ఆంధ్రులకు అంకితం చేస్తామని చెప్పారు మంత్రి అనిల్ కుమార్. అలా చేస్తే టీడీపీని మూసేస్తారా? అని ఛాలెంజ్ కూడా విరిశారు. మరి మంత్రి వీర లెవల్లో సినిమా డైలాగ్ వాడి ..ఇప్పుడేక్కడున్నారు అని ప్రతిపక్ష టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
TDP and CPI Are Serious About Minister Anil Kumar On Polavaram Project
నాడు ధీరత్వం.. నేడు ధీనత్వం ఎందుకు!
పోలవరం ఇరికేషన్ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి ఈ ఏడాది రూ.2,087 కోట్లు బకాయిలను విడుదల చేయాల్సి ఉండగా.. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ( పీపీఏ) కేవలం రూ.711 కోట్లు మాత్రమే ఇచ్చిందని అధికార వైసీపీ చెబుతోంది. పోలవరం నిర్మాణానికి కేంద్ర నిధులు జాప్యం చేస్తోందని ఆరోపిస్తుంది. నిర్మాణ ఖర్చులకు సంబంధించిన బిల్లుల స్క్రూటినీలో సమాచారం స్పష్టంగాలేదని అందుకే బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పార్లమెంట్ శీతాకాల సమావేశంలో పేర్కొన్నారు. ప్రాజెక్ట్ కు సంబంధించి 2014 నుంచి ఇప్పటి వరకు రూ. 11,600.16 కోట్లు తిరిగి చెల్లించిందని, 2019 మే నుంచి ఇప్పటి వరకు రూ.4,836 కోట్లు చెల్లించినట్లు కూడా మంత్రి తెలిపారు. ఇంకా రూ.2,000 కోట్లు ఇస్తే కానీ మిగతా పనులు పూర్తికాని పోలవరం ప్రాజెక్ట్ డిసెంబర్ 1, 2021 నాటికి పూర్తిచేస్తాం … ప్రారంభోత్సవానికి టీడీపీ కూడా రావాలని ఆహ్వానిస్తాం అని బీరాలు పలికిన అనిల్ మరి ఆనాటి ధీరత్వం .. నేడు లేదేం .. అని వామపక్షనేతలు విమర్శిస్తున్నారు. మాటలు పేల్చినంత వీజీ కాదు.. ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలంటే అని మండిపడుతున్నారు.
Must Read ;- ఇక నమ్మరు జగన్ ..! ఉద్యమ బరిలో నువ్వా-మేమా?











