విధులు మరిచి .. రాజకీయ ఒత్తుళ్లకు తలొగ్గి!
ఏపీ ఉద్యోగుల పరిస్థితి అత్యంత అద్వానంగా ఉంది. కనీస రూల్స్ పై పరిజ్ఞానం, ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే శ్రీకాకుంళం జిల్లా సంతబొమ్మాలి పంచాయితీ కార్యదర్శి ప్రభుత్వం ఓటీఎస్ విధానంపై కాస్తాంత డోస్ పెంచి .. వలంటీర్స్ పై, ప్రజలపై ఒత్తిడి తేవాలని ప్రయత్నించి అడ్డంగా బుక్కైయ్యాడు. ఓటీఎస్ విధానాన్ని ఒప్పకుని లబ్ధిదారులకు, కుటుంబ సభ్యులకు డిసెంబర్ పెన్షన్, రేషన్, తదితర ప్రభుత్వ పథకాలను నిలిపివేయాలని వలంటీర్స్ ను ఆదేశించాడు. ఈ నిర్వాకానికి తోడు పంచాయితీ తరుఫున ఒక సర్క్యూలర్ కూడా జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘించిన వలంటీర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, వసూళ్ల పూర్తి బాధ్యతను మీరే తీసుకోవాలని ఆదేశించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన వలంటీర్స్ ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలా రాజకీయ నాయకులు ఒత్తుళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో దీనినిబట్టే అర్థమౌతోంది.
ప్రభుత్వం చెప్పేదే కొంతే .. అధికారులు చేసేదే కొండంత!
ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలో మాత్రమే చెబుతోంది. కానీ కొంతమంది అధికారులు మాత్రం అధికార వైసీపీ మాదేనని, జగన్ మా నాయకుడే అన్నట్లు ఒక కార్యకర్త మాదిరిగా ప్రవర్తిస్తుంటారు. లేకుంటే లబ్ధిదారుడుకి శాశ్వత గృహ హక్కులు కల్పించే విధానంలో ఎక్కడ లబ్దిదారునిపై ఒత్తుడి తీసుకొచ్చి మరి ఈ పథకాన్ని రన్ చేయాలి అని లేదు. స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే ఈ ప్రక్రియలో ముందుకు పోవాలని ప్రభుత్వం ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. మరి అధికారులు లోకల్ నాయకులు ఒత్తుళ్లకు తలొగ్గి వలంటీర్స్ కు టార్గెట్లు విధించి మరి వేదిస్తున్నారన్నది తేటతెల్లం. ఈ క్రమంలోనే సంతబొమ్మాలి కార్యదర్శికి అనుసరించిన విధానపై ఉన్నతాధికారులు సీరియసై, షోకాజ్ నోటీసులను జారీ చేశారు. జిల్లా పంచాయితీ అధికారి రవి కుమార్ ఈ నోటీసులను ఇచ్చారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఉన్నప్పుడు, మరి అధికార వర్షన్ ఎందుకు భిన్నంగా ఉంటుందని అనుమానాలు తలెత్తక మానడంలేదు. దేవుడు ఆదేశిస్తాడు .. భక్తుడు పాటిస్తాడు అన్నట్లు అధికారులు విధులు నిర్వర్తిస్తే ఎలా? దీనికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నట్లు హెచ్చరికలు లేకపోలేదు.
Must Read ;- ఏంటీ కన్ఫ్యూజన్.. తిరుమలకు అనుమతుందా? లేదా??











