నిరసన వ్యక్తం చేసే నోర్లును మూయించేందుకు ప్రయత్నం..!
జగన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీని నమ్మి యువత వార్డు, గ్రామ సచివాలయాల ఉద్యోగాల్లో చేరారు. రెండేళ్ల శిక్షణ కాలం ముగియగానే.. పర్మినెంట్ చేస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే శిక్షణ కాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్న నేటికి ప్రొబేషన్ డిక్లేరేషన్ పై స్పష్టనివ్వకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. పోయిన సోమవారం రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. మొత్తం లక్ష కు పైగా సచివాలయం ఉద్యోగులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో జగన్ సర్కాక్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారి జాబితా అధికారులు ద్వారా సేకరిస్తోంది. పాల్గొన్న ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఉపక్రమిస్తన్నట్లు తెలుస్తోంది.
జీతాల్లో కోతలు.. వినకుంటే తొలగింపులు..!
రాజకీయ పార్టీలు ఎన్నికల్లో అలవికాని హామీలు గుప్పిస్తారు.. అధికారంలోకి వచ్చిన తరువాత అవి మరిస్తారు.. ఆ హామీలకే కదా.. మేం నమ్మి ఓట్లేసింది.. వాటి నేరవేర్చండి అని అడిగితే.. ఎక్కడలేని కోపం మీకెందుకు వస్తోంది. హామీలను నెరవేర్చాలని నిలదీస్తే.. దాడులు చేస్తారు, కేసులు పెడుతారు, అవసరమనుకుంటే దేశ ద్రోహం కిందా కేసు నమోదు చేసి జైలు పాలు చేసిన ఆశ్చర్య పోనక్కలేదు. అటువంటిదే నేడు ఏపీలోని 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 1.36 లక్షల మంది వార్డు, సచివాలయం ఉద్యోగుల దుస్థితి! జగన్ రెడ్డి అధికారం కోసం రోడ్లు పట్టుకుని అవకాశవాద రాజకీయాలు చేస్తున్న వేళా.. ఏపీ ఉద్యోగులకు హామీలు గుప్పించారు. నేడు వాటిని అడుగుతుంటే.. వారిపై కక్ష్య కట్టి, అధికారమనే ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. మరోవైపు వార్డు, గ్రామ సచివాలయం సిబ్బందికి రెండేళ్ల తరువాత ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని చెప్పి మాట తప్పారు. నేడు వాటి కోసం పోరాడుతుంటే.. వారిపై నిఘా పెంచి అణిచివేయాలని చూస్తున్నారు. సోమవారం సచివాలయం పరిధిలో ఎవరైతే నిరసన తెలిపారో, వారిని గుర్తించి, వారి జీతాల్లో కోతలు విధించాలని ప్రయత్నిస్తుంది. సచివాలయం ఉద్యోగులందరికీ జీతభత్యాల్లో కోత విధించాలంటూ.. మండల స్థాయి అధికారులకు ప్రభుత్వం బుధవారం ఆదేశాలిచ్చింది. ఇందుకు విరుద్ధంగా జీతభత్యాలు విడుదల చేస్తే.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ ఉన్నతాధికారులను హెచ్చరిస్తున్నారు. శాంతియుతంగా డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తే జీతభత్యాల్లో ఇలా కోత విధించడం సబబు కాదంటూ ఉద్యోగులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొబేషన్, పే స్కేల్ అమలు చేయకుండా, హక్కుతో వాటిని అడిగితే.. ఇటువంటి చర్యలకు పాల్పడటం ఏమిటని సచివాలయం సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.











