రోడ్డెక్కిన గురువులు.. కలెక్టరేట్ ముట్టడికి పిలుపు..!
చదువులు చెప్పె గురువులు నేడు వారి జీతాలు, జీవితాల కోసం ఏపీలో రోడ్డెక్కారు. విద్యార్థులకు పాఠాలే కాదు.. దారితప్పి, చదువు విలువ తెలియని మొద్దులకు సైతం గుణపాఠం చెప్పగల సమర్థలు గురువులను చాటేందుకు నిరసన బాటపట్టారు. దేశ భవిష్యుత్తుకు దిశా నిర్ధేశం ఉపాధ్యాయులు పీఆర్సీ కోసం ఉద్యమించారు. పీఆర్సీ పై ఇటీవల జగన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను వెనక్కి తీసుకుని, ఐఆర్ కన్న ఎక్కవ పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలానే తగ్గించిన హెచ్ఆర్ఏను పూర్వస్థితిని కొనసాగించాలని నినదించారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను గాలికొదిలేసి చిన్నచూపు చూస్తున్న జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని ఫ్యాప్టో నేతలు ఆగ్రహించారు. గురువారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఏపీ వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కేంద్రాలలో ఉన్న కలెక్టరేట్స్ ను ఫ్యాప్టో నేతృత్వంలో తలపెట్టిన ముట్టడి కార్యక్రమానికి ఉపాధ్యాయ సంఘాలు నేతలు భారీగా తరలివచ్చారు. ఫ్యాప్టో నిరసనలకు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాలు మద్దతును ప్రకటించాయి. ముట్టడి కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.
రేపు సీఎస్ కు సమ్మె నోటీసు.. పోరుకు సర్వసిద్ధం!
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలను వెనక్కి తీసుకుని ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 23 శాతం ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ తగ్గింపు, సీసీఎస్ రద్దు, 70 నుంచి 75 సంవత్సరాల ఫెన్షనర్లకు ఇచ్చే అదనపు ఫెన్షన్ కు సంబంధించిన జీవోలను ఎట్టి పరిస్థితిలో అంగీకరించబోమని ఉద్యోగ సంఘాలు ఆగ్రహిస్తున్నాయి. జీవోలను వెనక్కి తీసుకునే వరకు ప్రభుత్వంతో ఇక చర్చల్లేవని, సమ్మె అస్త్రాన్ని ప్రయోగించేందుకు జేఏసీ సిద్ధమౌతున్నాయి. గురువారం ఇరు జేఏసీల రాష్ట్ర కార్యవర్గం సమావేశం అనంతరం పూర్తి నిర్వీరామ కార్యచరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. శుక్రవారం సీఎస్ సమీర్ శర్మను కలిసి ఉమ్మడి జేఏసీ నేతలు వినతి పత్రం అందించనున్నట్లు ఉద్యోగ సంఘ నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు.
Must Read:-ఫ్యాప్టో నిరసనల్లో ‘పుష్ప’ పేరడీ సాంగ్స్ వైరల్..! పాటలతో కదం తొక్కిన గురువులు!!











