టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ .. పెళ్ళియిన తర్వాత తన స్టైలే పూర్తిగా మార్చేసింది. తదుపరి సినిమాల్లో డైనిమిక్ పాత్రలు పోషిస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ‘ఆచార్య, భారతీయుడు 2’ సినిమాల్లో కాజల్ .. అలాంటి పాత్రలే పోషిస్తుండగా.. నాగార్జున ప్రవీణ్ సత్తారు కాంబో మూవీలో ‘రా’ ఆఫీసర్ గా కనిపించనుంది. ఇదిలా ఉంటే.. మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ‘ఖిలాడీ’లో కూడా కాజల్ అలాంటి పాత్రనే పోషిస్తోందని వార్తలొస్తున్నాయి. అమ్మడు అందులో పోలీసాఫీసర్ గా నటించబోతోందట.
విజయ్, మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ తమిళ సినిమా ‘జిల్లా’లో మొదటి సారిగా కాజల్ .. పోలీసాఫీసర్ గా నటించి మెప్పించింది. ఇప్పుడు మళ్ళీ రవితేజ ఖిలాడీ లో పోలీస్ యూనిఫామ్ తొడగడం విశేషం గా మారింది. నిజానికి ఇందులో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి అనే కొత్త అమ్మాయిలు హీరోయిన్స్ గా నటిస్తున్నప్పటికీ.. ఈ సినిమాలో ఓ లేడీ పోలీసాఫీసర్ పాత్ర ఉందట. అది గెస్ట్ రోలే అయినా.. చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. దానికి కాజల్ అయితే బాగుంటుందని దర్శకుడు రమేశ్ వర్మ ఆమెను ఎంపిక చేశాడని వినికిడి. త్వరలో కాజల్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతుందట.
ఖిలాడీలో రవితేజ తండ్రి కొడుకులు గా నటిస్తున్నారు. అందులో తండ్రి పాత్ర మరణించినప్పటి నుంచి కథ సరి కొత్త మలుపు తిరుగుతుందట. ఇటీవల క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేపథ్యంలో రవితేజ తదుపరి చిత్రం అయిన ‘ఖిలాడీ’ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. రవితేజ కెరీర్ లోనే ఓ వైవిధ్యమైన సినిమాగా ఖిలాడీ నిలిచిపోతుందని చెప్పుకుంటున్నారు. మరి ఇందులో పోలీస్ గా కాజల్ ఏ రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.
Also Read : రవితేజ ‘ఖిలాడీ’ కి క్రేజీ స్టార్ రైటర్..?