ఏపీ నూతన ఎస్‌ఈసీగా మాజీ సీఎస్ నీలం సాహ్నిని నియమిస్తూ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ నిర్ణయం తీసుకున్నారు. 11 మంది విశ్రాంత ఐఏఎస్ పేర్లు పరిశీలించిన గవర్నర్ చివరకు నీలం సాహ్నిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఐఏఎస్ శ్యామ్యూల్‌పై కేసులు ఉండటంతో దూరం పెట్టినట్టు తెలుస్తోంది. మిగిలిన వారితో పోల్చుకుంటే నీలం సాహ్నిపై ఎలాంటి కేసులు లేక పోవడం ఆమెకు కలసి వచ్చిందని చెప్పవచ్చు. ప్రభుత్వం పంపించిన ముగ్గురు మాజీ అధికారులతోపాటు, మూడేళ్లలో పదవీ విరమణ చేసిన 11 మంది ఐఏఎస్‌ల పేర్లు కూడా పరిశీలించినట్టు తెలుస్తోంది. చివరకు నీలం సాహ్నీని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Nilam Sahni Appointed As New SEC For Andhra Pradesh :
లోతుగా పరిశీలించారు :
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంలో గవర్నర్ చాలా అంశాలను పరిశీలించారు. ముందుగా మాజీ ఐఏఎస్‌లు ప్రేమ్ చంద్రారెడ్డి, నీలం సాహ్నిలకు సంబంధిరంచిన అన్ని వివరాలతో ఏసీఆర్‌లను తెప్పించుకుని పరిశీలించారు. ఇందులో నీలం సాహ్నికి ఎక్కువ మార్కులు రావడంతో ప్రేమ్ చంద్రారెడ్డి పేరును పక్కన పెట్టారని తెలుస్తోంది. నీలం సాహ్నిపై ఎలాంటి కేసులు లేకపోవడం ఆమెకు కలసి వచ్చింది. దీంతో నీలం సాహ్నిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ శుక్రవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు.
Must Read ;- జగన్ సాబ్ ఏం చెప్పినా.. వినయ విధేయ సాహ్నీకి కీలక పదవి..?