కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సన్నాఫ్ ఇండియా. సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ , 24 ఫ్రెమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘గాయత్రి’ సినిమా తర్వాత మోహన్ బాబు చేస్తోన్న సోలో సినిమా ఇది. కరోనా కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయ్యింది.
ఇప్పుడు ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ముహుర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 29న ఉదయం 10 గంటలకు సన్నాఫ్ ఇండియా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. 560కి పైగా చిత్రాల్లో పలు వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన మోహన్‌బాబు దేశభక్తి ప్రధానంగా రూపొందుతోన్న సన్నాఫ్ ఇండియా మూవీలో ఏ అంశాన్ని టచ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మేస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు.
ఇప్పటి వరకు రాని కథతో.. ఇప్పటి వరకు మోహన్ బాబు చేయని పాత్రతో ఈ సినిమా రూపొందుతోందని తెలిసినప్పటి నుంచి ‘సన్నాఫ్ ఇండియా’ పై క్యూరియాసిటీ పెరిగింది. ‘అల్లరి మొగుడు, అసెంబ్లీ రౌడీ, మేజర్ చంద్రకాంత్, పెదరాయుడు..’ ఇలా బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించిన మోహన్ బాబు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఇటీవల మోహన్ బాబు ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంలో కీలక పాత్ర పోషించడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ‘సన్నాఫ్ ఇండియా’తో ఏరేంజ్ సక్సస్ సాధిస్తారో చూడాలి.
Must Read ;- ఆస్కార్ బరిలో సూర్య ‘సూరారై పోట్రు’
All set for #SonOfIndia🇮🇳 First Look!!#SonOfIndiaFirstlook will be unveiled on 29th-January @ 10:00 AM.#SOI @themohanbabu
Directed by @ratnababuwriter
🎶 Maestro #Ilaiyaraaja Musical@iVishnuManchu @LakshmiManchu @vinimanchu #SreeLakshmiPrasannaPictures pic.twitter.com/A6AD34BQlJ— 24 Frames Factory (@24FramesFactory) January 27, 2021











